అమెరికాలో చట్టవిరుద్థంగా ఉంటున్న అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.
ఇప్పటికే 104 మందితో కూడిన విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి (The plane landed at Amritsar Airport in Punjab.)చేరుకున్న సంగతి తెలిసిందే.తాజాగా అక్రమ వలసదారులతో కూడిన మరో విమానం భారత్‌కు రానున్నట్లు అమెరికా ప్రభుత్వం (US Government)సమాచారం అందించింది.
119 మంది భారతీయులతో కూడిన విమానం శనివారం అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకోనుంది.వీరిలో 67 మంది పంజాబ్‌కు(Punjab) చెందినవారు కాగా.33 మంది హర్యానా, 8 మంది గుజరాత్, ముగ్గురు ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన ఇద్దరేసి మంది, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.అధికారులు పరిస్ధితిని నిశితంగా పరిశీలిస్తున్నారని.విమానాశ్రయంలో సరైన భద్రత, విధానపరమైన ఏర్పాట్లు చేశామని ఓ అధికారి చెప్పారు.ఇమ్మిగ్రేషన్, పోలీస్, విదేశాంగ శాఖ అధికారులు విమానాశ్రయంలో అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.

అయితే అక్రమ వలసదారులున్న విమానాలను తమ రాష్ట్రానికి పంపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab Chief Minister Bhagwant Mann) కేంద్రంపై మండిపడ్డారు.పంజాబ్ ప్రతిష్టను దిగజార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని , ఏ ప్రమాణాల ఆధారంగా అక్రమ వలసదారుల విమానాలను ల్యాండ్ చేయడానికి పంజాబ్‌ను ఎంపిక చేశారో విదేశాంగ శాఖ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ఉపయోగించుకుంటుందని భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు.

దీనిపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయొద్దని దుయ్యబట్టింది.ఆప్ నాయకులకు దేశ భద్రత గురించి పట్టదని, వారికి కేవలం రాజకీయాలు మాత్రమే కావాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే మరో విమానం కూడా పంజాబ్‌కు చేరుకుంటుందని ఆదివారం లేదా మరో రోజున విమానం ల్యాండ్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.