ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.18
సూర్యాస్తమయం: సాయంత్రం 05.41
రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.00 సా4.00 ల6.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో చికాకులు తప్పవు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారు.ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
వృషభం:
ఈరోజు మీ కుటుంబంలో కొన్ని బాధతలను నెరవేరుస్తారు.మీరు చేసే ఉద్యోగంలో ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం అవసరం.
మిథునం:
ఈరోజు మీ ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తవుతాయి.అనుకోకుండా ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు చేసే దూర ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులని కాపాడుకోవాలి.అనారోగ్య సమస్యతో ఉన్నవారు ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి
సింహం:
ఈరోజు మీరు వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగుతారు.మీరంటే కిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.
కన్య:
ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తులా:
ఈరోజు మీరు చేసే పనుల్లో ఆదాయం పెరుగుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.విద్యార్థులు ఈ రోజు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు ఆరోగ్యపట్ల విశ్రాంతి తీసుకోవాలి.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
మకరం:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు
కుంభం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.ఇతరుల మాటలు మీ మనసులో ఎంతో నొప్పిస్తాయి.అనవసరమైన ఆలోచనలు చేయకపోవడం మంచిది.
మీనం:
ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
LATEST NEWS - TELUGU