సంక్రాంతి సంబరాల్లో పిండి వంటలకు ఉన్న ప్రాముఖ్యత.. దీని వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటంటే..

హిందువులు జరుపుకునే పండుగలు అతి పెద్ద పండుగ సంక్రాంతి.ఈ పండుగను జరుపుకునే విధానం పండుగ ప్రాముఖ్యత ఈ పండుగలో ఉండే పిండి పదార్థాల్లో గల ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

 The Importance Of Pastries In Sankranti Celebrations.. The Health Secret Behind-TeluguStop.com

ప్రతి పండుగకు ఆయా కాలాన్ని బట్టి సాంప్రదాయ గుంటలను తయారు చేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో సంక్రాంతి వచ్చిందంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, ఆటలు కోడిపందాలు మాత్రమే కాకుండా సంప్రదాయ వంటలు కూడా ఉంటాయి.

అరిసెలు, సున్నుండలు, జంతికలు, సకినాలు, నువ్వుల ఉండలు ఇలా ప్రాంతాలను బట్టి రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు.ఈ ఒక్కొక్క పిండి వంటకు ఒక్కొక్క రుచి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.

ఈరోజు సంక్రాంతి పిండి వంటల ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి అరిసలే.

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అరిసెలు లేని సంక్రాంతిని ఊహించడం కష్టమైన పనే.వీటిని బెల్లం కొత్త బియ్యపు పిండితో తయారు చేస్తూ ఉంటారు.అదనపు రుచి కోసం కొబ్బరి, నువ్వులు కూడా అందులో కలుపుతారు.బెల్లం రక్తాన్ని శుభ్రం చేస్తుంది.శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతుంది.

Telugu Ariselu, Devotional, Digestive, Festival, Benefits, Secret, Sankranti-Lat

పండుగతో సంబంధం లేకుండా అన్ని రకాల వయసు వారికి అలరించే వంటకం జంతికలు.మరి సంక్రాంతికి జంతికలు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండే పిండి వంటకం.రకరకాల రుచులతో తయారు చేసుకునే ఈ జంతికలు బియ్యం, పెసరపప్పు లేదా శనగపిండి, ఉప్పు, కారం, నువ్వులు జోడించి తయారు చేస్తూ ఉంటారు.

మరి కొందరు వాము కూడా అందులో కలిపి తయారుచేస్తారు.అందువల్లే ఇవి తేలికగా జీర్ణం అవుతాయి.తెల్ల నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ నువ్వుల ఉండలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.నువ్వుల్లో ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఉంటాయి.

చలికాలంలో నువ్వుల ఉండాలని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎముకల బలహీనత రక్తహీనతతో బాధపడే వారికి నువ్వుల ఉండలు ఎంతో మంచి పౌష్టికాహారం.

ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇచ్చే మన సంప్రదాయ వంటలను పిల్లలకు తప్పనిసరిగా అలవాటు చేయడం ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube