సాధారణంగా కుంకుమ అంటేనే ప్రతి ఒక్కరికి ఎరుపు రంగులో ఉన్నది గుర్తుకు వస్తుంది.అయితే ఆకుపచ్చ రంగులో ఉన్న కుంకుమ ధరించడం వల్ల ఎప్పటికీ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇలా ఏదైనా పండుగ రోజు లేదా ప్రతి శుక్రవారం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి మన ఇంట్లో ఏ విధమైనటు వంటి ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటాయి.కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ పచ్చ కుంకుమా ధనానికి సంకేతం.
కుబేరుడు ధనానికి అధిపతి కనుక ఈ పచ్చను ధరించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.
పురాణాల ప్రకారం కుబేరుడు ఆ శివ భక్తుడు.
అయితే ఎప్పటిలాగే శివపార్వతులను కలవడానికి కైలాసం వెళ్లిన కుబేరుడు శివ పార్వతులు ఏకాంతంలో ఉన్న సమయాన్ని చూస్తాడు .దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివపార్వతులు వారి ఆగ్రహానికి కుబేరుడి శరీరాన్ని దహనం చేస్తారు.అయితే అనుకోకుండా తప్పు జరిగి పోయిందని తనను క్షమించమని వేడుకున్న కుబేరుడు పట్ల జాలి తలచిన శివ పార్వతులు తిరిగి వారి శరీరం నుంచి భూమిపై ఉద్భవించిన కాంతి వల్ల ఈ నెల మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారి పోయింది.
ఇది గమనించిన కుబేరుడు ఆ మట్టిని తన వంటికి రాసుకోవడం వల్ల తన శరీరం మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారి పోయింది.అప్పటి నుంచి ఈ ఆకు పచ్చ రంగు కుంకుమను ఎవరైనా పెట్టు కోవటం వల్లవారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.ఎవరి ఇంట్లో అయితే ఆకుపచ్చ కుంకుమ ఉంటుందో అలాంటి వారిపై ఆ కుబేరుడు అనుగ్రహం ఉంటుంది.
వారికి ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు.