టంగ్ స్లిప్ అవుతున్న చినబాబు ! తిప్పలు పడుతున్న టీడీపీ

ఏపీ ఎన్నికల్లో విజేతగా నిలిచి మరోసారి అధికారం దక్కించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందిపెడుతూ ముందుకు వెళ్తున్నాడు.చంద్రబాబు వ్యూహాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా ఆయన తనయుడు లోకేష్ తీరుతో టీడీపీ ఇబ్బంది పడుతోంది.

 Nara Lokesh Tongue Slips Again-TeluguStop.com

లోకేష్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధం అయ్యాడు.అందుకోసం మంగళిగిరి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగాడు.

ఇక్కడివరకు బాగానే ఉన్నా ఎన్నికల ప్రచారంలో లోకేష్ తరుచూ టంగ్ స్లిప్ అవ్వడం, అది విపక్షాలకు కలిసొచ్చే అంశంగా మారింది.సోషల్ మీడియాలో అయితే లోకేష్ మీద సెటర్లు గట్టిగానే వస్తున్నాయి.

మొన్ననే ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని సెల్ఫీ దిగడంతో నవ్వులపాలయ్యాడు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.మంగళగిరి మాలోకం సెల్ఫీ అంటూ దానికి కొత్త పేరు పెట్టి అందరూ అదేవిధంగా సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెడుతున్నారు.అలా ఉండగానే నిన్న టీఆరఎస్ అధినేత మీద విమర్శలు చేస్తూ ఆంధ్రా అభివృద్దిని కేసీఆర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తూనే మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని చెప్పి కలకలం రేపాడు.

ఇది లోకేష్ ను మరింత నవ్వులపాలు చేసింది.

లోకేష్ అజ్ఞాని అని అనుకున్నామే గానీ.సముద్రం లేని తెలంగాణలో పోర్టుల నిర్మాణం సాధ్యం కాదన్న విషయం తెలియనంత అజ్ఞానా అంటూ మరొకొందరు కామెంట్స్ పెట్టారు.చినబాబు తీరుతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి అజ్ఞానిని ఎమ్మెల్యేగా చెప్పుకునేందుకు కూడా జనం సిగ్గుపడే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.గతంలోనే లోకేష్ అనేకసార్లు టంగ్ స్లిప్ అయ్యి టీడీపీ ని ఇరుకునపెట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు.

లోకేష్ కి తెలుగు నేర్పడంతో పాటు ప్రసంగాలకు సంబంధించి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు.అయినా చినబాబు లో మాత్రం మార్పు రాకపోవడంతో ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube