Turmeric Ginger Water : రాత్రుళ్లు నిద్ర పట్టడానికి మందులు వాడుతున్నారా.. అయితే అవి ఆపి ఇది ట్రై చేయండి?

ఇటీవల కాలంలో రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక సతమతం అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.గంటలు తరబడి ఫోన్లు టీవీలు చూడటం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి తదితర కారణాల వల్ల కంటికి కునుకు కరువు అవుతుంది.

 If You Take This Drink At Night You Will Get Good Sleep 2-TeluguStop.com

దీంతో ఊబకాయం నుంచి మధుమేహం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టడానికి స్లీపింగ్ పిల్స్( Sleeping pills ) వాడుతుంటారు.

కానీ స్లీపింగ్ పిల్స్ రెగ్యులర్ గా వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.స్లీపింగ్ పిల్స్ అంత‌ర్గ‌త అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

Telugu Ginger, Sleep, Tips, Jaggery, Latest, Problems, Turmeric, Turmeric Ginger

అందుకే నిద్ర పట్టడానికి మందులు వేసుకోవడం ఆపి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను ట్రై చేయండి.ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది.పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్ వేసుకోవాలి.అలాగే రెండు తొక్క తొలగించిన అల్లం స్లైసెస్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పచ్చి పసుపు కొమ్ము మరియు అల్లం మిశ్రమాన్ని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి( Jaggery powder ) కలిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.

నైట్ నిద్రించడానికి అరగంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.

Telugu Ginger, Sleep, Tips, Jaggery, Latest, Problems, Turmeric, Turmeric Ginger

ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు మెండుగా ఉంటాయి.ఈ డ్రింక్ ఒత్తిడి( Stress )ని దూరం చేస్తుంది.శరీరానికి విశ్రాంతినిస్తుంది.

మీరు హాయిగా నిద్ర పోవడానికి సహాయపడుతుంది.నిద్ర యొక్క నాణ్యతను పెంచే సామర్థ్యం కూడా ఈ డ్రింక్ కు ఉంది.

కాబట్టి ఎవరైతే రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైలీ డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.కొలెస్ట్రాల్ క‌రిగించి గుండెకు అండగా సైతం నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube