1.బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళ అరెస్టు
ఇద్దరు భారతీయ మహిళలను బ్యాంకాక్ లోని సువర్ణభూమి విమానాశ్రయం లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిద్దరూ తమ లగేజీలో కొన్ని అరుదైన జీవులను అక్రమంగా తరలిస్తుండడంతో వారిని అరెస్ట్ చేశారు.వీరు చెన్నైకి వీటిని తరలించే ఆలోచనతో ఉండడంతో పోలీసుల అరెస్ట్ చేశారు.
2.మక్కాలో వంట పై నిషేధం.
భారతీయ యాత్రికుల ఇబ్బందులు
వచ్చే నెలలో జరిగే హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా పుణ్యక్షేత్రానికి చేరుకున్న వేలాది మంది భారతీయులు భోజన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మక్కా లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తొలగించారు వంట చేయడం పై అక్కడ ఆంక్షలు విధించడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన 3500 మంది యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
3.ఆస్ట్రేలియాలో పెరిగిన ప్రవాస భారతీయుల సంఖ్య
తాజాగా విడుదలైన ఆస్ట్రేలియా జనాభా లెక్కల్లో విదేశాల్లో జన్మించి ఆస్ట్రేలియా లో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య పరంగా మూడో స్థానంలో నిలిచారు.
4.డల్లాస్ లో జొన్నవిత్తుల ఆధ్వర్యంలో ‘ యజ్ఞేశ్వర శతక ‘ పద్య గాన మహోత్సవం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA ) , ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX ) లు సంయుక్తంగా యజ్ఞేశ్వర శతకము పద్య గాన మహోత్సవ కార్యక్రమాన్ని డాలస్ మెట్రో ఏరియాలోని ఫ్రిస్కో నగరంలో వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు వేద కవి ,సినీ గీత రచయిత జొన్నవిత్తుల వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
5.టి పిసిసి ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ నూతన కన్వీనర్ గా నరేష్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి నియమితులయ్యారు.
6.కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు… 51 మంది మృతి
లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలోని జైలు లో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది.దీంతో రెచ్చిపోయిన కొంతమంది ఖైదీలు జైలులో నిప్పు పెట్టడంతో దాదాపు 51 మంది ఖైదీలు మరణించారు.
7.విదేశాల నుంచి వచ్చే వారిపై క్వారంటైన్ ఆంక్షలు సడలించిన చైనా
విదేశాల నుంచి చైనా వచ్చే వారిపై ఉన్న క్వారంటైన్ ఆంక్షలను చైనా సడలించింది.విదేశాలతో పోలిస్తే చైనా కఠినమైన కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది.
8.రష్యాపై ఉక్రెయిన్ ప్రధాని విమర్శలు
రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా మారిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి విమర్శించారు.
9.పాత్రికేయుడి అరెస్టుపై స్పందించిన ఐరాసా
ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ వెబ్సైట్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణ ఉండాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో పేర్కొన్నారు.
10.ఆటా మహాసభలో పాల్గొన్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) 17 వ మహా సభను నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ వేడుకలకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.జులై 1 నుంచి 3 వరకు ఈ మహాసభలు జరగనున్నాయి.