పాలనలో ఎదురవుతున్న ఒక్కో సమస్యను అధిగమిస్తూ. తెలంగాణలో తన పాలనకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి.
( CM Revanth Reddy ) ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాలను విజయవంతంగా అమలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.దీంట్లో ప్రధానంగా రైతులకు రుణమాఫీ( Farmers Loan Waiver ) అంశం అతి పెద్ద సవాల్ గా మారింది.
రుణమాఫీ అమలు చేయాలంటే వేలాది కోట్లు అవసరం అవుతాయి .దీంతో రేవంత్ రెడ్డి రుణమాఫీని అమలు చేయలేరని ఈ విషయంలో ఆయన విఫలం అవుతారని విపక్షాలు విమర్శలు చేస్తూనే వస్తున్నాయి.అయితే దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రుణమాఫీ విధానంపై అనేక మార్పు చేర్పులు చేశారు.
![Telugu Congress, Farmersloan, Harish Rao, Pcc, Runamafi, Telangana Cm, Telangana Telugu Congress, Farmersloan, Harish Rao, Pcc, Runamafi, Telangana Cm, Telangana](https://telugustop.com/wp-content/uploads/2024/07/cm-revanth-reddy-sensational-loan-waiver-decision-for-farmers-detailsa.jpg)
వీటిపై అనేక రోజులపాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు.ప్రస్తుతం రెండు లక్షల రుణమాఫీని కట్ ఆఫ్ కంటే నెల రోజులు ముందుగానే అమలు చేస్తున్నారు.ఈరోజు నుంచి లక్ష వరకు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీని రేవంత్ రెడ్డి డెత్ లైన్ గా పెట్టుకున్నారు.ప్రజలకూ ఈ విషయాన్ని చెప్పారు.
కాకపోతే జూలై 20వ తేదీ కంటే ముందే ఈ ప్రక్రియను మొదలుపెట్టారు.లక్ష వరకు రుణమాఫీ చేయడానికి అవసరమైన నిధులు లభించడంతో ఈరోజు నుంచి ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు.
అనుకున్న మేర రుణమాఫీని విజయవంతంగా అమలు చేస్తే రేవంత్ రెడ్డి కి తెలంగాణ జనాల్లో మరింత ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
![Telugu Congress, Farmersloan, Harish Rao, Pcc, Runamafi, Telangana Cm, Telangana Telugu Congress, Farmersloan, Harish Rao, Pcc, Runamafi, Telangana Cm, Telangana](https://telugustop.com/wp-content/uploads/2024/07/cm-revanth-reddy-sensational-loan-waiver-decision-for-farmers-detailss.jpg)
ఇప్పటి వరకు అనేక సమస్యలను రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి.అలాగే నిరుద్యోగుల ఆందోళన తోపాటు ,చిన్న చిన్న సమస్యల పైన బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శలు చేస్తోంది .ముఖ్యంగా కేటీఆర్ ,( KTR ) హరీష్ రావులు( Harish Rao ) చేస్తున్న విమర్శలు రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి .ఈ వ్యవహారాల ఉండగానే రుణమాఫీ ని రేవంత్ రెడ్డి ప్రకటించారు.