విశ్వక్సేన్.( Vishwak Sen ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు విశ్వక్‌సేన్.ఇటీవల కాలంలో విశ్వక్‌సేన్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలు సాధిస్తున్నాయి.
అదే ఊపుతో ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు విశ్వక్‌సేన్.ప్రస్తుతం లైలా( Laila Movie ) అనే సినిమాలో నటించారు.
తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది.ఈ సినిమా సక్సెస్ సంగతి పక్కన పెడితే ఎక్కువగా కాంట్రవర్సీలలో నిలిచిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా హీరో విశ్వక్ సేన్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

విశ్వక్ తో ఆడియన్స్ కి కనెక్షన్ ఏర్పడిందన్న విషయం తెలిసిందే.తనలోని ఒరిజినాలిటీ చూసి తను ఎంతో క్యాజువల్ గా చెప్పిన నాగుల పంచమి అనే ఒక్క డైలాగ్ ఒక జనరేషన్ యూత్ కి గుర్తుండిపోయేలా చేసింది.ఇక విశ్వక్ ఈ ఫాలోయింగ్ ని మాస్ ఇమేజ్( Mass Image ) వైపు తిప్పారు.
డ్యాన్సులు, ఫైట్లు, కమర్షియల్ ఫీట్లు చేయగల నటుడు తనలో కూడా ఉన్నాడని నిరూపించేకునే ప్రయత్నం చేశారు.ఈ ప్రయత్నం మంచిదే.ప్రతి నటుడికి మాస్ మూల విరాట్ అవ్వాలనే వుంటుంది.కానీ విశ్వక్ కథల ఎంపిక అలా వుండటం లేదు.
వాంటెడ్ గా మాస్ ని మెస్మరైజ్ చేసేయాలనే ప్రయత్నం దెబ్బకొడుతోంది.విశ్వక్ కెరీర్ ని ఒక్కసారి గమనిస్తే.
ఈ నగరానికి, ఫలక్ నుమా, హిట్, గామి, అశోక వనంలో చిత్రాలే కళ్ళముందు కదులుతాయి.

మిగతావన్నీ మాస్ విఫలయత్నాలే.కొన్నాళ్ళుగా అయితే విశ్వక్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ బ్లాంక్ అయిపోతున్నారు.కారణం నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు వున్న ఒక మామూలు రొటీన్ మాస్ సినిమా విశ్వక్ లాంటి నటుడు చేయడం ప్రేక్షకులకే అంతు చిక్కడం లేదు.
నిజానికి అలాంటి సినిమాలు చేయడానికి విశ్వక్ లాంటి నటుడు అవసరం లేదు.బోలెడు మంది హీరోలు చేస్తున్నారు.కాబట్టి ఇక మీదట అయినా విశ్వక్సేన్ అలాంటి కథలు కాకుండా కెరియర్ పుంజుకోవాలి అంటే కొత్త కాన్సెప్టులు కొత్త తరహాలో సినిమాలు చేస్తేనే బెటర్ అంటున్నారు.