శ్రీ రామ భక్తుడైన ఆంజనేయ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనకు ఎక్కువ భయం వేసినా ఏదైనా జరిగినా వెంటనే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆ హుమంతుడిని తలుచుకుంటాం.
ఎందుకంటే అంజన్నను స్మరిస్తే… సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలిగి పోతాయి. స్వామి వారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రార్థనకు విశిష్టత ఉంది.
శ్రీ హనుమాన్ మాలా మంత్రాన్ని జపిస్తే… అన్ని వ్యాధులు, పీడలు తొలిగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయ చరిత్ర వివరిస్తోంది. అయితే పంచ ముఖాలతో ఉండే స్వామి వారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది.
అయితే హనుమంతుడు ప్రధాన ముఖంగా ఉంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్ట సిద్ధి కల్గుతుంది.
అయితే నారసింహునికి అభీష్ట సిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. కుడి వైపు చివరన ఉండే వరాహ ముఖం దాన ప్రవృత్తిని ఎడమ వైపు చివరన ఉండే హయగ్రీవ ముఖం సర్వ విద్యలను కలుగజేస్తాయి.
అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అన్ని విధాల శుభం అని పురాణాలు చెబుతున్నాయి.
తుంగ భద్ర నదీ తీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచ ముఖ ఆంజనేయలుగా ప్రత్యం అయినట్లు తెలుస్తోంది.
పంచముఖ హనుమాన్ కు ఉన్న పది చేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పై నుంచి వచ్చే విపత్తుల నుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచ ముఖంగా దర్శనమిస్తారు.
అందుకే మనం ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం.