క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడే ఎందుకు తీసుకుంటాడు?

దేవతలు ఒకవైపు నుంచి రాక్షసులు మరో వైపు నుంచి క్షీర సాగర మథనాన్ని చిలుకుతుండగా… ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు, రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

 Why Does Lord Shiva Himself Take The Halakhal Born In The Milky Way, Devotional-TeluguStop.com

 వెంటనే త్రిమూర్తుల్లో ఒకరైన పరమ శివుడి వద్దకు వెళ్తారు. క్షీర సాగర మథనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్ర తాంబూలంగా స్వీకరించాలని దేవ దానవులు ఆ శివుడిని కోరుతారు.

 ముందుగా పుట్టింది హాలాహలం అని గ్రహించిన ఆ శివుడు. పార్వతీ దేవితో సేవించమంటావా అని అడుగుతాడు.

 సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పడంతో. శివుడు అందుకు ఒప్పుకుంటాడు.

వెంటనే క్షీర సాగర మథనం వద్దకు వెళ్లి హాలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవడం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడని తీసుకొని తలపై పెట్టుకుంటాడు. అయినా వేడి వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకుంటాడు.

 అయినా తాపం విపరీతంగా ఇబ్బంది పెట్టడంతో… శివునికి నిత్యం అభిషేకం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం.

 క్షీరసాగర మథనంలో పుట్టిన ముఖ్యమైన వాటన్నింటినీ దేవతలే తీసుకున్నప్పటికీ. హాలాహలాన్ని శివుడు తీసుకుంటాడు.

 రాక్షసులు మాత్రం సురాపాణం తీసుకొని సంతోషిస్తారు. చివరి వరకు అమృతాన్ని పంచుతామని చెప్పిన దేవదేవతలు.

 చివరకు రాక్షసులకు ఏమీ దక్కకుండా చేస్తారు.

Why Does Lord Shiva Himself Take The Halakhal Born In The Milky Way, Devotional , Ksheera Sagara Madhanam, Parama Shivudu, Shivudu , Telugu Devotional - Telugu Devotional, Ksheerasagara, Parama Shivudu, Shivudu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube