రాత్రి నిద్రపోయే సమయంలో మనం కొన్ని పద్ధతుల్ని పాటించడం వలన మనకు నిద్ర బాగా పడుతుంది.అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అయితే వేసవికాలంలో రాత్రిపూట ఈ అద్భుతమైన డ్రింక్ ని( Drink ) తీసుకుంటే ఒంట్లో మొత్తం వేడి తొలగిపోతుంది.అలాగే ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది.
ఎండాకాలం సమయంలో ఎండలు విపరీతంగా ఉంటాయి.ఈ వేడి వలన మనకు ఎంతో చికాకు ఉంటుంది.
అలాగే ఈ వేడి వలన దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.
దీంతో అలసట లాంటివి కలుగుతూ ఉంటాయి.
అయితే వేసవిలో ఇమ్యూనిటీ ( Immunity ) కూడా బాగా తగ్గిపోతుంది.అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.
దీని వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.అంతేకాకుండా అతిసారం, తలనొప్పి లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
వాతావరణం ఇలా మారిన ప్రతి సారి ఆహార విషయంలో కొన్ని మార్పులు కచ్చితంగా చేసుకోవాలి.వేసవిలో( Summer ) వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

వేసవిలో అరటి గుజ్జు రసం తాగడం చాలా మంచిది.అరటిపండు లో ఎన్నో పోషకాలు ఉంటాయి.అందుకే ఎండాకాలంలో అరటిపండు( Banana ) రసం తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.షుగర్ ఉన్నవాళ్లు కూడా దీన్ని కచ్చితంగా తీసుకోవచ్చు.అలాగే గుల్కన్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు.రాత్రి నిద్రపోయే ముందు గుల్కన్డ్ మిల్క్ తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది.
దీని వలన మనకి మంచి నిద్ర పడుతుంది.వేసవిలో ఎక్కువ ఎండ ఉండడం వలన ఆ వేడిని తట్టుకోవడానికి చెరుకు రసం తాగడం కూడా చాలా మంచిది.

దీని వలన ఒంట్లో వేడి తగ్గిపోతుంది.అలాగే తక్షణ ఎనర్జీ ని కూడా పొందవచ్చు.వేసవి కాలంలో నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం కూడా చాలా మంచిది.ఎందుకంటే వేసే కాలంలో మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వలన డిహైడ్రేషన్ లాంటి ఇబ్బందులు ఉండవు.
అలాగే మజ్జిగ, నిమ్మరసాన్ని కూడా వేసవిలో ఎక్కువగా తీసుకోవచ్చు.ఇలా తీసుకోవడం వలన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.