బ్రహ్మ దేవుడికి, యముడికి ఎక్కువగా గుడులు ఉండటం కనిపించదు. ఎక్కడో కన్ని చోట్ల మాత్రమే మనుషుల ప్రాణాలు తీసే యమ ధర్మరాజుకు, అందరి తల రాతలు రాసే బ్రహ్మ దేవుడిగి ఆలయాలు ఉంటాయి.
అయితే యమ ధర్మరాజు కింద పనిచేసే. అంటే మనుషుల పాప పుణ్యాలను లెక్కగట్టే చిత్ర గుప్తుడి గురించి మనందరికీ తెలుసు.
కానీ ఆయనకూ ఓ గుడి ఉందని మాత్రం తెలియదు. అందులోనూ ఆ గుడి మన హైదరాబాద్ లో ఉందని చాలా మందికి తెలియదు.
ఇప్పుడు మనం ఆ విశేషాలను తెలుసుకుందాం.
అయితే ఈ చిత్ర గుప్తుడి గుడిని హైదరాబాద్ లో 18వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
నవాబుల కాలంలో వారి వద్ద పనిచేసే గుమాస్తాలు చిత్ర గుప్తుడ్ని ఆరాధ్య దైవంగా కొలిచే వారట. వారి కోసం అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్.
. సువిశాల ప్రదేశంలో ఈ దేవాలయాన్ని కట్టించారట.
అంతే కాకుండా చిత్ర గుప్తుడి తోపాటు ఆయన భార్యలు నందిని, శోభావతి విగ్రహాలనూ ఆ గుడిలో ప్రతిష్టించారు. చిత్ర గుప్తుడితో పాటు వారికి కూడా నిత్యం భక్తులు పూజలు చేస్తుంటారు.
అయితే రాహు, కేతు గ్రహాలకు గురువుగా భావించే చిత్ర గుప్తుడ్ని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఏడు బుధ వారాలు చిత్ర గుప్తిడికి ప్రత్యేక పూజ చేస్తే మనం కోరుకున్నది నెరవేరుతుందని చెబుతుంటారు.
ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం సహా మరే ఇతర సమస్యలైనా తొలగి పోతాయని ప్రతీతి. అందుకే చాలా మంది ఈ చిత్ర గుప్తుడికి పూజలు చేస్తున్నారు.
ప్రతి గురువారం గుడి భక్తులతో కిట కిట లాడుతుంది.