విజయ్ కి ఝలక్ ఇచ్చిన రష్మిక.. అతని సినిమా నుంచి?

తమిళ సినీ నటుడు విజయ్ గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.ఆయనకు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

 Rashmika Aparted From Vijay Upcoming Project Rashmika Mandana, Vijay, Delip, Tol-TeluguStop.com

ఇక ఈయన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందిస్తాయి.ఈయన సరసన నటించడానికి ఎంతో మంది హీరోయిన్ లు ఎదురు చూస్తుంటారు.

ఈయన సినిమాల గురించి అభిమానులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు.

ఇదిలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక స్టార్ హీరోల సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.ఇక రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.

అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఓ సినిమాను చేయనుండగా అందులో రష్మిక ను హీరోయిన్ గా ఎంపిక చేశారట.ఇదే కాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించేందుకు రష్మిక కు అవకాశం రాగా వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Delip, Tollywood, Vijay-Movie

ప్రస్తుతం నెల్సన్ దిలిప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విజయ్ 65 వ సినిమా లో హీరోయిన్ కన్నడ బ్యూటీ రష్మిక ను ఎన్నుకున్నారట.కానీ తనకు డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పిందట.ఇక మరో హీరోయిన్ పూజా హెగ్డే ను సంప్రదించారట.దీంతో పూజా హెగ్డే కు ఇదివరకే విజయ్ తో నటించాలనే ఆసక్తి ఉండగా ఇక ఈ అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట.

ఇదిలా ఉంటే పూజా హెగ్డే 2012లో తమిళంలో మూగ మూడు అనే సినిమాతో తొలిసారిగా తన నటనకు ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా అనుకున్నంత గుర్తింపు తేలేకపోయేసరికి తెలుగు సినిమాలో అడుగు పెట్టింది.మొత్తానికి తాను కోరుకున్న హీరో సినిమాలో నటించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube