కంటి నిండా నిద్ర ఉంటే దాదాపు 90 శాతం అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కానీ ఇటీవల రోజుల్లో కోట్లాది మందినిద్రలేమి సమస్య( Insomnia )తో బాధపడుతున్నారు.
నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆరోగ్యం పాడవుతుంది.ఒత్తిడి పెరుగుతుంది.
ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.అందుకే నిద్రలేమిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం మంది నిద్ర పట్టడానికి మందులు వాడుతుంటారు.

కానీ దీర్ఘకాలికంగా మందులు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.సహజంగానే నిద్రలేమిని వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ డ్రింక్ ను తీసుకుంటే నిద్రలేమికి ఈజీగా బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పు( Almond ) వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో అరకప్పు సోంపు వేసి స్లైట్ గా వేయించి తీసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న సోంపు వేసుకోవాలి.
అలాగే అర కప్పు పటిక బెల్లం, నాలుగు మిరియాలు( Black pepper ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి సేవించాలి.

ఈ డ్రింక్ ను రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు తీసుకోవాలి.ఇలా చేస్తే నిద్రలేమి సమస్య దెబ్బకు పరారవుతుంది.ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.
ఒత్తిడి దూరం అవుతుంది.మెదడు శరీరం రిలాక్స్ అవుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను తీసుకుంటే నిద్రలేమికి ఎలాంటి మందులు వాడక్కర్లేదు.
సహజంగానే సమస్యను పరిష్కరించుకోవచ్చు.