చేదు బాదం పప్పులు ఆరోగ్యానికి మంచివా.. కాదా..

ప్రతిరోజు కొన్ని బాదంపప్పులు తినడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 Are Bitter Almonds Good For Health.. Or Not , Bitter Almonds , Health, Health Ti-TeluguStop.com

నానబెట్టిన బాదం పప్పులు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇవి రుచికి తీయగా ఉండడంతో ఎవరైనా వీటిని ఇష్టంగా తింటారు.

కానీ మీరు ఎప్పుడైనా చేదు బాదాం పప్పుల ను తిన్నారా.అవును బాదం రుచికి తీయగా, కాస్త వగరు రుచిని కలిగి ఉంటుంది.

కానీ చేదు బాదం మాత్రం ఘాటైన రుచి నీ కలిగి ఉంటాయి.

అయితే చేదుగా ఉన్న బాదంపప్పు తినవచ్చా, ఇది ఆరోగ్యానికి మంచిదేనా, అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఈ, పాస్ఫరస్, రాగి పుష్కలంగా ఉంటాయి.అందుకే వీటిని శక్తివంతమైన గింజలు అని అంటారు.

అయితే బాదంపప్పులో చేదువి కూడా ఉంటాయి.

Telugu Amygdalin, Bitter Almonds, Fiber, Tips, Magnesium, Vitamin-Telugu Health

సాధారణ వాటి మాదిరిగానే ఇవి కూడా వాటిని పోలి ఉంటాయి.అందుకే వాటిని గుర్తించడం చాలా కష్టం.తిన్న తర్వాత మాత్రమే రుచిని బట్టి వీటిని తెలుసుకోవచ్చు.

మామూలు బాదం మాదిరిగానే వాటిలో పోషకాలు ఉంటాయి.కానీ మరీ చేదు ఎక్కువగా ఉంటుందంటే అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది.

ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది.అందుకే చేదు భాగం తీసుకోవడం విషపూరితం అవుతుంది.

ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.ఒకవేళ మీరు బాదం తీసుకున్నప్పుడు చేదు తగిలితే వాటిని మింగకుండా బయటకి ఉమ్మివేయడం మంచిది.

లేదంటే ఇది ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube