ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించి తాజాగా విడుదలైన రాధేశ్యామ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.దేశంలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్లలో రాధేశ్యామ్ టీజర్ రెండో స్థానంలో ఉంది.
అయితే ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా ఇద్దరి మధ్య మాటల్లేవని తెలుస్తోంది.ప్రభాస్ పూజా హెగ్డే గత కొన్ని నెలలుగా అస్సలు మాట్లాడుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.
కొన్నిరోజుల క్రితం యూవీ సంస్థ ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని క్లారిటీ ఇచ్చినా ప్రభాస్ పూజా హెగ్డే మొహామొహాలు చూసుకోలేదని కాంబినేషన్ సన్నివేశాలను కూడా కలిసి చేయలేదని సమాచారం.రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి రెండు నెలలలో ప్రభాస్, పూజా హెగ్డే ఒకరికొకరు ఎదురుపడలేదని తెలుస్తోంది.
గ్రీన్ మ్యాట్ పై షూటింగ్ చేసి ప్రభాస్, పూజా హెగ్డే సీన్లను కాంబినేషన్ సన్నివేశాలను సమాచారం.
సినిమా క్వాలిటీని పట్టించుకోకుండా ముఖాలు కూడా చూసుకోకుండా ప్రభాస్, పూజా హెగ్డే వ్యవహరించారంటే ఆశ్చర్యమే అని చెప్పాలి.

అయితే పూజా హెగ్డే సమాచారం ఇవ్వకుండా షూటింగ్ కు హాజరు కాలేదని ప్రభాస్ ఆమె కోసం ఎదురుచూసి విసుగు చెందాడని వినిపిస్తోంది.ఆ తర్వాత ప్రభాస్, పూజా హెగ్డే మధ్య మాటలు లేవని సమాచారం.ఈ రీజన్ బలమైనది కాకపోయినా ప్రభాస్ మాత్రం హర్ట్ అయ్యాడని తెలుస్తోంది.

ప్రభాస్, పూజా హెగ్డే కలిసి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పాల్గొంటారో లేదో చూడాల్సి ఉంది.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ లో కొంతమంది మాత్రం ప్రభాస్ పుట్టినరోజున పూజా హెగ్డే విషెస్ చెప్పిందని వాళ్లిద్దరి మధ్య ఏ గొడవ జరగలేదని అభిప్రాయపడుతున్నారు.పూజా హెగ్డే, ప్రభాస్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇస్తే బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.