టాలీవుడ్ లో ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో టిఆర్పి రేటింగ్ పరంగా దూసుకుపోవడం కాకుండా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.ఇప్పటికే షో కి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్ లో బాగానే ట్రేడింగ్ అవుతున్నాయి.
అయితే తాజాగా వచ్చేవారం ప్రోమోని షో నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ చేసినటువంటి స్కిట్టు ప్రోమోకే హైలెట్ గా నిలుస్తోంది.
అయితే ఇందులో ముందుగా గెటప్ శ్రీను బెత్తం వంశానికి చెందిన వాళ్ళు కావడంతో అందరినీ బెత్తంతో కొడుతూ కామెడీని పండించాడు.అయితే ఇందులో భాగంగా సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను కూతుర్ని పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లగా వారిని కూడా బెత్తంతో కొడుతూ ఉంటారు.
అయితే ఈ క్రమంలో ఇద్దరు వ్యాఖ్యాత రోజా దగ్గరికి మెల్లగా ఆమె కూడా వారిని బెత్తంతో కొడుతూ పంచులు తెలుస్తుంది.

అయితే ఇందులో సుడిగాలి సుదీర్ ఎంత చెప్పినప్పటికీ రోజా బెత్తంతో కొడుతూనే ఉంటుంది.అంతేగాక ఇలా చేయడం వల్ల తనకు మినిస్టర్ పదవి ఇస్తారా అంటూ పంచ్ పెలుస్తింది.దీంతో నెటిజన్లు ఈ పని బాగానే ట్రోల్ చేస్తున్నారు.
అంతేగాక కొందరైతే బెత్తంతో కొట్టడం వల్ల మంత్రి పదవులు ఇవ్వరని తన నియోజకవర్గానికి అవసరమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా అంటూ సెటైర్ గా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ప్రోమో లో మహేష్ బాబు నటించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బాగా ఫేమస్ అయినటువంటి రమణ లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్ చెబుతూ పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశంలో నటించినటువంటి నటుడు కూడా ముక్కు అవినాష్ టీంలో హల్ చల్ చేశాడు.
దీంతో ఈ వచ్చే వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ అదిరిపోతుందని నెటిజన్లు అంటున్నారు.