టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా శోభిత ధూళిపాళ్ల( Sobhita Dhulipala ) ఒకరు.శోభిత ధూళిపాళ్ల ఏడాది క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఒక బ్రాండ్ వాళ్లు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి అడిషన్ కు పిలిచారని నాకు విచిత్రంగా అనిపించిందని ఆమె తెలిపారు.
నేను సరే అని వెళ్లగా అడిషన్ పూర్తైందని శోభిత చెప్పుకొచ్చారు.
యాడ్ షూటింగ్ కోసం గోవా( Goa ) వెళ్లాల్సి ఉంటుందని చెప్పారని ఆమె పేర్కొన్నారు.గోవా అనగానే నేను ఎగ్జైట్ అయ్యేవాడినని శోభిత అన్నారు.
గోవా వెళ్లాక ఫస్ట్ డే షూట్ బాగానే జరిగిందని ఆమె తెలిపారు.ఆ తర్వాత కెమెరాలో ఏదో సమస్య అని చెప్పి మిగతా షూట్ తర్వాత చేద్దామని చెప్పారని శోభిత కామెంట్లు చేశారు.

ఆ తర్వాత రోజు నేను సెట్ కు వెళ్లగా ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్ కు సరిపోదు అంటూ కామెంట్లు చేశారని నేను కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నానని వద్దన్నారని శోభిత పేర్కొన్నారు.నా ప్లేస్ లో ఒక శునకాన్ని పెట్టుకున్నారని అమె తెలిపారు.ఒకరోజు వర్క్ చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చారని శోభిత వెల్లడించారు.శోభిత ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

శోభిత రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.హీరోయిన్ శోభిత కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చైతన్య( Chaitanya ) శోభిత కలిసి నటిస్తే చూడాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అక్కినేని అభిమానుల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.శోభితకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.