సాధారణంగా ఎంత తోముకున్నా కొందరి దంతాలు పసుపు పచ్చగా గార పట్టేసి ఉంటాయి.పళ్ల వరుస ఎంత అందంగా ఉన్నప్పటికీ.
దంతాలు పచ్చగా ఉంటే మాత్రం అందహీనంగానే కనిపిస్తారు.అందుకే ఇలాంటి వారు ఎదుట వారితో మాట్లాడాలన్నా, నలుగురిలో హాయిగా నవ్వాలన్నా తెగ ఇబ్బంది పడిపోతుంటారు.
అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.దంతాలను న్మాచురల్‌గానే తళతళ మెరిపించుకోవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

నారింజ తొక్కలు పసుపు పచ్చని దంతాలను తెల్లగా మార్చడంలో అద్భుతంగా సహాయపడతాయి.మరి వీటిని పళ్లకు ఎలా యూజ్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నారింత తొక్కలను ఎండ బెట్టుకుని.
మెత్తగా పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ నారింజ తొక్కల పొడిలో కొద్దిగా నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పళ్లకు అప్లై చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా రుద్దుకుని.చల్లటి నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో నాలుగు సార్లు చేస్తే దంతాలు తెల్లగా మారతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని.
అందులో ఒక స్పూన్ నారింజ తొక్కల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి.ఇప్పుడు ఈ పొడితో దంతాలను తోముకుని.
నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా డే బై డే చేస్తూ ఉంటే.
పసుపు పచ్చని పళ్లు తెల్లగా, కాంతివంతంగా మారతాయి
ఇక ఈ టిప్స్ తో పాటుగా ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆహారాలను తీసుకోవాలి.కనీసం నెలకు ఒక సారి అయినా టూత్ బ్రెష్ మార్చాల్సి ఉంటుంది.
రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవాఇ.ఒక మంచి మింట్ టూత్ పేస్టును వాడితే పళ్లకు మంచిది.
కూల్‌డ్రింక్స్, టీ, కాఫీలు, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.