1.విజయవాడకు రజనీకాంత్

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈరోజు విజయవాడకు ఇచ్చేశారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు.
2.కలెక్టర్లు ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

స్పందన కార్యక్రమం పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
3.ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కేల్లో మూడో అడిషనల్ చార్జి షీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు.అరుణ్ పిళ్లే, అమన్ సింగ్ పై ఈడి అభియోగాలు నమోదు చేసింది.
4.నేడు అవినాష్ రెడ్డి బెయిల్ పై విచారణ

నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
5.కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష
నేడు నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
6.ఏపీ ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
నేడు ఏపీ ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది అమరావతి జేఏసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు ట్రేడ్ యూనియన్ లు సమావేశం అయ్యాయి.
7.నేడు రేపు ఏపీకి వర్ష సూచన

నేడు రేపు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
8.ఐపీఎల్
ఐపీఎల్ లో నేడు పంజాబ్ లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది.మొహాలీ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
9.సిసోడియా బెయిల్ పై నేడు తీర్పు

లిక్కర్ స్కాం లో సిసోడియా బెయిల్ పై నేడు తీర్పు వెలువడనుంది.ఈరోజు మధ్యాహ్నం కోర్టులో దీనిపై విచారణ జరగనుంది.
10.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు
టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
11.నేడు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు ప్రారంభం

నేడు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.దేశవ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్ మీటర్ల ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
12.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది.
శ్రీవారి సర్వర్శనానికి 11 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.భక్తుల సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
13.తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

భక్తుల సందర్శనగరం ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలను నిన్న తెరిచారు.
14.కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలు
కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ సీఎం కేసీఆర్ భరిస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు.
15.సీటెట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో సిటెట్ నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నెల 27 నుంచి 26 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
16.మే ఒకటి నుంచి షిరిడీలో నిరవధిక బంద్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడీలో మే ఒకటి నుంచి నిరవధిక బంద్ నిర్వహించనున్నారు.ఆలయ భద్రతకు ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను నియమించడాన్ని నిరసిస్తూ అక్కడి వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
17.ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల తేదీన విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.మే 24 నుంచి ఒకటి వరకు సఫలమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
18.ఢిల్లీ విమానాశ్రయంలో బాంబు కలకలం
ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లుగా ఓ అగంతకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తనిఖీలు చేపట్టారు.అయితే ఇదంతా బూటకమని పోలీసుల విచారణలో తేలింది.
19.పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ కెవి గోపాల్ రావు, బత్తిన శ్రీనివాసులను ఏపీ ప్రభుత్వం నియమించింది.
20.హైకోర్టు ను ఆశ్రయించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జి

తిరుమల శ్రీవారి ప్రోటోకాల్ భక్తుల ఆధార్ కార్డులను మార్చడంతో పాటు, నగదు తీసుకున్నాను అన్న ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.