తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.అమెరికా కు తెలంగాణ తల్లి విగ్రహం

తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఈ నెల ,27-29 తేదీల మధ్య న్యూజెర్సీ లో మెగా కన్వెన్షన్ ను నిర్వహిస్తోంది.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

దీనిని తెలంగాణలోని ఓ శిల్పి వద్ద 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు స్థూపం, 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయిస్తోంది.దీనిని కొరియర్ ద్వారా అమెరికాకు తరలించి.అక్కడ ఆవిష్కరించనున్నారు. 

2.అమెరికాలో ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

 

Telugu America, Bank England, Canada, Festival, Swathi Dhingra, Nats, Nri, Nri T

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను ఈనెల 28న అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ నగరం లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూఎస్ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు. 

3.ఆస్ట్రేలియాలో పీవీ నరసింహారావు విగ్రహం

  ఆస్ట్రేలియా ప్రధాన నగరమైన సిడ్నీ పరిధిలోని సౌత్ ఫీల్డ్ కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మేరో తో టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ విభాగం అధ్యక్షుడు మహేష్ బిగాల భేటీ అయ్యారు.ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు గురించి బ్లాక్మెరో తో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. 

4.భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

 

Telugu America, Bank England, Canada, Festival, Swathi Dhingra, Nats, Nri, Nri T

బ్రిటన్ లో భారత సంతతి మహిళ డాక్టర్ స్వాతి ధింగ్రా కు కీలక బాధ్యతలు దక్కాయి.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్వాతికి ఆ దేశ ఆర్థిక మంత్రి రుషి సునక్ కీలక బాధ్యతలు అప్పగించారు.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో ఎక్స్ టర్నల్ సభ్యురాలిగా నియమించారు. 

5.అమ్మ గొప్పతనాన్ని చాటిన నాట్స్ వెబినార్

 ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మ గొప్పతనాన్ని తెలియజేసేలా వెబినార్ నిర్వహించింది. 

6.ఉక్రెయిన్ అధ్యక్షుడు బావోధ్వేగ ప్రసంగం

 

Telugu America, Bank England, Canada, Festival, Swathi Dhingra, Nats, Nri, Nri T

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కేన్స్ వేడుకల్లో భావోద్వేగ ప్రసంగం చేశారు.తమ దేశంపై రష్యా నిత్యం అడుగు చేస్తుంటే వేలాది మంది చనిపోతున్నా.సినీ ప్రపంచం మౌనంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

7.పాక్ లో ముందస్తు ఎన్నికలు లేవు

  పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి అని మీడియాలో వస్తున్న వార్తలపై ప్రధాని సెనబాజ్ స్పందించారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని పూర్తి కాలం ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించారు. 

8.పెట్రోల్ కొనడానికి కూడా డబ్బులు లేవు

 

Telugu America, Bank England, Canada, Festival, Swathi Dhingra, Nats, Nri, Nri T

శ్రీలంక లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగిపోయాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే శ్రీలంక ఇంధన మంత్రి తాజాగా ఓ ప్రకటన చేశారు.పెట్రోల్ కొనేందుకు తగిన విదేశీ మారక నిల్వలు కూడా లేవని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube