కూతురు సినీరంగ ప్రవేశంపై సురేఖ వాణి కీలక నిర్ణయం

సీనియర్ నటి ఎన్నో సినిమాల్లో హీరోలకు హీరోయిన్స్ కు తల్లిగా నటించి మెప్పించిన సురేఖ వాణి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు.ఆమె భర్త చనిపోయిన సమయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా వాటికి సమాధానం చెప్పిన సురేఖ కూతురు సుప్రిత తో జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.కూతురు తో సురేఖ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.40 ఏళ్ల సురేఖ వాణి తన 20 ఏళ్ల కూతురుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.ఇద్దరు కూడా సోషల్‌ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.చిన్న పిల్లల మాదిరిగా అల్లరి చేస్తూ హడావుడి చేస్తూ ఉంటారు.సురేఖ ఆమద్య కూతురు సినిమా రంగ ప్రవేశం కు సంబంధించిన వార్తలను ఖండించింది.కాని ఆ తర్వాత తనకు ఇష్టం ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.

 Surekha Vani About Her Daughter Supritha Film Entry , Supritha , Supritha Reels-TeluguStop.com

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సురేఖ వాణి తన కూతురు సుప్రిత ను హీరోయిన్ గా పరిచయం చేయాలని భావిస్తుందట.ఆమద్య కొన్ని వెబ్‌ సిరీస్ లతో పాటు చిన్నా చితకా సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కించుకుందట.

కాని ఇప్పటి వరకు సుప్రిత ను ఏ సినిమా కు సైన్ చేయించలేదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్ని కుదుట పడ్డ తర్వాత మాత్రమే సుప్రితను సినిమా ల్లో నటింపజేస్తానంటూ సురేఖ ఇటీవల ఒక చిట్ చాట్‌ సందర్బంగా చెప్పుకొచ్చిందట.

అంటే సుప్రిత వెండి తెర ఎంట్రీకి కనీసం రెండేళ్ల సమయం అయినా పడుతుంది.సుప్రిత సినిమా ద్వారానే కాకుండా వెబ్‌ సిరీస్ లో అయినా నటించేందుకు సిద్దంగా ఉందట.

ఇక సుప్రిత డాన్స్ తో పాటు నటన కు కూడా శిక్షణ పొందినట్లుగా తెలుస్తోంది.ఇదే సమయంలో సురేఖ వాణి కూడా వరుసగా సినిమా లను దక్కించుకుంటుంది.

స్టార్‌ హీరోల తో సినిమా ల్లో కాకున్నా కొత్త హీరోల సినిమా ల్లో అయినా నటిస్తూ వస్తోంది.తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఒకే సినిమా లో కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube