జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి?

మనిషి ఒక్కొక్కరిని చూసి తన గుణాలను మార్చుకోవాలి.మనకు ఉపయోగపడే ఎలాంటి దాన్ని అయినా సరే… ఎవరి నుండైనా నేర్చుకోవచ్చని మన పురణాలు చెబుతున్నాయి.

 What Should Learn Man From Animals , Animals , Devotional , Janthuvulu , Telug-TeluguStop.com

జంతువులు, చెట్లు..

ఇలా దేని నుంచి అయినా సరే మనకు ఉపయోగపడే అంశాలను తెలుసుకోవచ్చని వివరిస్తున్నాయి.అయితే ముఖ్యంగా జంతువులకు రాజు అయిన సింహము నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి రెండు విషయా లనీ, కుక్క నుంచి ఆరు విషయాలనీ, గాడిద నుంచి మూడు విషయాలనీ, కాకి నుంచి అయిదు విషయాలనీ, కోడి నుంచి నాలుగు విషయాలను నేర్చుకోవాలి.

మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వ శక్తులనూ ఉపయోగి స్తుంది.కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారం గానూ కాలాను గుణంగానూ తీసుకుంటుంది.

మనిషి కూడా కార్యాన్ని అలానే చేయాలి.

అలాగే కుక్క అవసరమైనంత భుజించుట, అల్ప సంతోషము, చక్కటి నిద్ర, తగు సమయమున నిద్ర లేచుట, నమ్మిన బంటుగా ఉండుట, పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది.

ఈ ఆరు గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి.అలాగే గాడిద మోయలేని బరువుని కూడా మ్రోస్తుంది.వాతావరణాన్ని లెక్క చేయక పోవటం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండుట.ఈ మూడు గుణాలను గాడిద నుంచి నేర్చుకోవాలి.

కాకి నుంచి అడ్డుగల శృంగారమూ, కాఠిన్యమూ, ఇల్లు నిర్మించుకొనుటలో జాగురూకత, సోమరి తనాన్ని లేకుండుట… ఇట్టివి నేర్చుకోవాలి.ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది.

పోరాటంలో వెనుకకు తగ్గకుంటడుట, ఉదయాన్నే నిద్రలేవటమూ, బంధువులతో భుజించటమూ, ఆపదలప్పుడు స్త్రీలను.అంటే పెట్టను రక్షించుకొనుట వంటివి కోడి నుండి తెలుసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube