ఇంద్రకీలాద్రి పై అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు...

9వ రోజు విజయదశమి సందర్బంగా నేడు శుక్రవారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమిస్తున్నారు.విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

 The Most Glorious Dussehra Festival On Vijayawada Indrakeeladri Details, Dasara-TeluguStop.com

దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు.చిరునవ్వుతో చెరుకుగడను వామ హస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదించే రూపంతో షోడ శాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం.

శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి నాడు దర్శించడం వలన సర్వ శుభములు కలుగుతాయని భక్త్తుల విశ్వాసం.ఉత్సవాలలో చివరి ఘట్టమైన తెప్పోత్సవం తో దసరా ముగింపు.

కృష్ణా నదిలో గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వరులు త్రిలోక సంచారం చేసేందుకు కృష్ణమ్మ ఒడి లో జలవివహారం.

మూడుసార్లు ప్రదక్షణ గా సాగె ఈ ఘట్టాన్ని తిలికించేందుకు భక్తులు పోటెత్తుతారు.

నది లో వరద ప్రవాహం ఉన్నందున విహారం ను రద్దు చేసి తీరం లోనే ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube