ప్రముఖ సినీ నటుడు సుమన్( Suman ) ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ ఈయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి అలాగే, రాజకీయాలకు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ ఉంటారు.అయితే తాజాగా ఈయన ఏపీ ప్రభుత్వం గురించి అలాగే తిరుమల దేవస్థానం గురించి పవన్ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పనిచేస్తుందని సుమన్ తెలిపారు.ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన పథకాలని ఒక్కసారిగా ఇవ్వటం సాధ్యం కాదు కనుక ఒక్కొక్క పథకాన్ని ఒక్కోసారి అమలు చేస్తూ వెళ్తున్నారని సుమన్ తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారని తెలియచేశారు.ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళనాడులో హిందీ భాష గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ వ్యాఖ్యలపై కూడా సుమన్ స్పందించారు.హిందీ భాష నేర్చుకోవడం అనేది అవసరం కానీ బలవంతంగా ఒక భాషను మరొకరిపై రుద్దడం సరైన విషయం కాదని తెలిపారు.

తిరుమలలో( Tirumala ) శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు ఈయన తెలిపారు.బి ఆర్ నాయుడు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిపారు.అక్కడికి వెళ్లే భక్తులకు చాలా సులభంగా ఉండటానికి గదులు దొరుకుతున్నాయి.దర్శనం కోసం గంటలు తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదని, పాలకమండలి సమావేశాలలో సామాన్య భక్తులకు అవసరమయ్యే విషయాల గురించి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని సుమన్ ఏపీలో ప్రభుత్వ తీరు పట్ల ఎంతో గొప్పగా మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.