సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కుటుంబాలలో మంచు కుటుంబం ( Manchu Family ) ఒకటి.మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎంతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు.
ఈయన వారసులుగా ఇండస్ట్రీలో విష్ణు ( Vishnu ) మనోజ్( Manoj ), లక్ష్మీప్రసన్న కూడా కొనసాగుతున్నారు.అయితే ఈ ముగ్గురు మాత్రం అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.బహిరంగంగా రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం పోలీస్ స్టేషన్ లకు వెళ్లడం వంటివి జరిగాయి.

ఈ క్రమంలోనే మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి పెద్ద కోడలు విరోనికా ( Veronika ) ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.సాధారణంగా ఈమె తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా ఇన్వాల్వ్ కారు ముఖ్యంగా ఎలాంటి ఇంటర్వ్యూలకు కూడా విరోనికా హాజరు కారు కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కుటుంబం గురించి అలాగే తన పిల్లల గురించి ఎన్నో విషయాలు తెలిపారు.ఇక తన కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి కూడా ఓపెన్ అయ్యారు.

ఈ సందర్భంగా తన కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి స్పందిస్తూ… అందరి కుటుంబాల్లో గొడవలు ఉంటాయి.దురదృష్టవ శాత్తు మా కుటుంబంలో కూడా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ గొడవలు మొత్తం కుటుంబంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పిల్లలే.ఇలాంటి విషయాలు పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని భయం వేస్తుంది.
ఇలా అన్నదమ్ముల మధ్య జరిగే గొడవలు చూసి పిల్లలు కూడా భయపడుతున్నారు.ఏమి జరుగుతుందోనని ఆలోచిస్తున్నారు.
ఇవి పిల్లల సహజ స్వభావాలు.పిల్లలు తెలివిగా ఉండాలంటే నేను కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ ఈమె తన కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.