మనకు మార్కెట్లో ప్రతి రోజూ ఎన్నో రకాల కూరగాయలు లభిస్తూ ఉంటాయి.ఎవరైనా సరే తమ కష్టాలకు అనుగుణంగా కూరగాయలను తెచ్చుకొని వండి తింటూ ఉంటారు.
అయితే మనకు మార్కెట్లో కంద కూడా కనిపిస్తూ ఉంటుంది.చూసేందుకు ఇది అంతా ఆకర్షణీయంగా ఉండకున్న దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
చూడడానికి సరిగ్గా కనిపించని ఈ దుంగను చాలామంది అసలు పట్టించుకోరు.నలుపు రంగులో ఉండి లోపల అంతా దుంప మాదిరిగా ఉంటుంది.
కనుక దీన్ని తినేందుకు ఎవరు ఇష్టపడరు.కానీ దీంట్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.
ఈ క్రమంలోనే కందను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కందాను కొన్ని చోట్ల పులగందా అని కూడా అంటారు.ఇది మనకు ఏడాది పొడవునా లభిస్తుంటుంది.దీనిని ఎప్పుడైనా సరే తినవచ్చు.
ఇతర దుంపల మాదిరిగా అనే దీన్ని కూడా వేపుడు లేదా పులుసు, కూర చేసుకుని తినడం ఎంతో మంచిది.అయితే దీని కోసే సమయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
లేదంటే చేతులకు దురదపడుతుంది.అలాగే తినేటప్పుడు కూడా పెదవులకు అంటకుండా తినవలసి ఉంటుంది.
లేదంటే అది దురదగా అనిపిస్తుంది.ఇది కంద తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ కందలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసి మంచి కొలెస్ట్రాలను పెంచుతాయి.ఈ కాంద తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పెరుగుతాయి.అంతేకాకుండా క్యాన్సర్లు రాకుండా ఈ దుంప ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ కంద తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇది బరువు తగ్గడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది.