తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న చాలామంది హీరోలు ప్రస్తుతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు.ఇక నితిన్( Nithin ) లాంటి హీరో కూడా ‘రాబిన్ హుడ్’( Robinhood ) సినిమాతో భారీ విజయనందుకొని స్టార్ హీరోగా మారిపోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ప్రస్తుతానికి ప్లాపుల్లో ఉన్న నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటానని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఈ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు.ఈ ఈవెంట్లో డేవిడ్ వార్నర్( David Warner ) సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల సినిమా మీద హైప్ అయితే క్రియేట్ అయింది.
మొత్తానికైతే డేవిడ్ వార్నర్ లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి నటించడం… ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమాకు సంబంధించిన రీల్స్ చేస్తూ బాగా పాపులారిటిని సంపాదించుకున్నాడు.

మరి అలాంటి వ్యక్తిని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయాలనే ఐడియా కూడా చాలా మంచిదనే చెప్పాలి.దీనివల్ల సినిమా మీద కొంత వరకు హైప్ అయితే క్రియేట్ అయింది.మరి 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక నితిన్ ప్రస్తుతానికైతే ఫ్లాప్ ల్లో ఉన్నాడు మరి ఈ సినిమాతో హిట్ వస్తే మాత్రం ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.