విదేశీ యానం, విదేశాలలో ఉద్యోగం, వ్యాపారం, విదేశాలలో స్థిరపడాలనుకోవడం వంటి విషయాలను వాయువ్య మూలను బట్టి చెప్పవలసి ఉంటుంది.విదేశీ యనానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వాస్తు పరంగా కొన్ని చిట్కాలను పాటిస్తే ఆ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.
సాధారణంగా విదేశాల కు వెళ్లడానికి రకరకాల కారణాలు ఉన్నాయి.చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పర్యటనలు, యాత్రలు ఇందులో ముఖ్యమైనవి.
ఇందులో ఏ కారణం అయినప్పటికీ ఇంట్లో చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ప్రామాణిక వాస్తు శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.
విదేశీయానానికి సంబంధించినంతవరకు వాయువ్య దిశకి అత్యంత ప్రాధాన్యం ఉంది.
వాయువ్య ములలో గనుక ఏవైనా దోషాలు ఉండడం ఉండడం వల్ల విదేశీయానానికి ఆటంకాలు, అడ్డంకులు అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి.అంతే కాకుండా ఇంట్లో వాయువ్య మూలలో బరువులు ఉన్న, ఎత్తుగా ఉన్న, నీళ్ల ట్యాంకు ఉన్న, పంపు ఉన్న వాయువ్యంలో దోషం ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది.
అటువంటివి ఉంటే విదేశీ యనానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి.ఈ మూలలో అక్కరలేని వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే తీసేయడం ఎంతో మంచిది.అవి తీసేసిన తర్వాత వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి.విదేశీ యనానికి ఉన్న ఆటంకాలు దూరం అయిపోతాయి.
వాయువ్యం వైపు తలపెట్టి పడుకున్న కూడా విదేశి యననికి అవకాశాలు మెరుగుపడతాయి.విదేశీ సంబంధమైన అవకాశాలకు ఏవైనా సమస్యలు ఎదురైతే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వాయువ్య దిశగా తలపెట్టి నిద్రపోవడం వల్ల విదేశీ యణనికి ఉన్న సమస్యలు దూరమవుతాయి.అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారు అక్కడికి తీసుకువెళ్లే ముఖ్యమైన వస్తువులను వాయువ్య ములలో ఉంచడం వల్ల ఉపయోగం ఉండే అవకాశం ఉంది.