Dark Spots : ముఖంపై నల్ల మచ్చలు అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఇలా చేశారంటే వారం రోజుల్లో మాయం అవుతాయి!

మనలో చాలా మందికి ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి.ఎండల ప్రభావం, హైపర్ పిగ్మెంటేషన్, వృద్ధాప్యం, మొటిమలు, హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గులు తదితర కారణాల వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.

 Try This Home Remedy For Spotless Glowing Skin-TeluguStop.com

ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.అందాన్ని చెడగొడతాయి.

ఈ క్రమంలోనే నల్ల మచ్చలను ( Dark spots )వదిలించుకునేందుకు ఎన్నెన్నో క్రీములు పాడుతుంటారు.అయితే సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Telugu Tips, Dark Spots, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotle

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీని కనుక పాటించారంటే కేవలం వారం రోజుల్లోనే ముఖం పై నల్ల మచ్చలను వదిలించుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడ‌ర్ వేసుకోవాలి.

Telugu Tips, Dark Spots, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotle

అలాగే వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్( Neem Powder ) మరియు ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పూతలా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని రోజుకు ఒకసారి పాటించారంటే చర్మంపై ఎలాంటి ముదురు రంగు మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అవుతాయి.ఓట్స్, కొబ్బరి పాలు, వేప పొడిలో ఉండే సహజమైన బ్లీచింగ్ లక్షణాలు మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడతాయి.

అలాగే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.అందంగా మరియు గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.పైగా ఈ రెమెడీ మీ చర్మానికి ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించదు.కాబట్టి మచ్చలేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube