ప్రస్తుత కాలంలో వ్యాపారం జరగడమే కాదు… ఆ వ్యాపారం చేసే ఓనర్ కస్టమర్లతో నడుచుకునే తీరు కూడా ఆ షాప్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి.ఇకపోతే తాజాగా జరిగిన ఒక సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో ఓ కస్టమర్ షాపు ఓనర్ ని తన షాపును క్లీన్ గా పెట్టుకోమని చెప్పినందుకు గాను.నీకు ఇష్టం ఉంటే ఇక్కడ తిను లేకపోతే వెళ్ళిపో.
నువ్వు ఎవడ్రా నా షాపు క్లీన్ గా ఉంచుకోమని చెప్పడానికి అంటూ కస్టమర్ పై అందరి ముందు వాదులాటకు దిగాడు.అంతేకాదు అక్కడున్న కస్టమర్లను ఉద్దేశించి కూడా.
వీళ్ళందరూ తింటున్నారు, నేను పెట్టింది తింటున్నారు, మీ కళ్ళకు కనిపించేది వాళ్లకు కనిపించడం లేదా అంటూ ఆ కస్టమర్ పై బండ బూతులు తిడుతూ విరుచుకుపడ్డాడు ఆ షాపు ఓనర్.అయితే ఈ మాటలు అన్నది ఓ పెద్ద షాప్ యజమాని అని అనుకుంటున్నారా కానే కాదు.

ఓ పానీపూరి, కచొరి అమ్ముకునే షాప్ ఓనర్.పశ్చిమ బెంగాల్ ( West Bengal )రాష్ట్రంలోని కోల్కతా నగరంలో దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన క్లబ్ కచోరి షాప్( Club Kachori Shop ) యజమాని.లాలిచంగాని అనే ఈ ఓనర్ గత 20 సంవత్సరాలు పైబడి ఈ వ్యాపారాన్ని అక్కడ కొనసాగిస్తున్నాడు.దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ వ్లాగర్స్ అతని దగ్గరికి వచ్చి వీడియోలు తీయడం ద్వారా ఆయన చాలా ఫేమస్ అయ్యాడు.
ఇంకేముంది సోషల్ మీడియాలో వీడియోలు కనబడడం ఆలస్యం లేదు ప్రజలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించకుండా అక్కడికి వెళ్లి తినేయడం పరిపాటిగా మారిపోయింది.

ఇలాగే కాబోలు ఓ వ్యక్తి ఆ షాప్ కు వెళ్లి కచోరి ఇవ్వమని అడిగాడు.ఇందులో భాగంగానే కస్టమర్ ఆ దుకాణం పరిస్థితులను చూసి కాస్త శుభ్రంగా ఉంచుకొని అమ్మవచ్చు కదా అని ఓనర్ కి సూచించాడు.దీంతో ముందుగానే కోపద్రికుడిగా పేరుగాంచిన ఆయన వెంటనే ఆ కస్టమర్ పై బూతు పురాణం అందుకున్నాడు.
ఆ కస్టమర్ ని నీకు ఇష్టం ఉంటే ఇక్కడ తిను.లేకపోతే ఇకనుంచి వెళ్ళిపో.అంటూనే అనేక బూతులు తిట్టాడు.ఈ సన్నివేశం అంత ఆ కస్టమర్ సంబంధించిన వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి విడుదల చేశాడు.
అంతే కాదండి ఈ వీడియోకు సంబంధించి భారతదేశంలో అత్యంత అపరిశుభ్రమైన కచోరి వాలా అంటూ ట్యాగ్ చేశాడు.చూడాలి మరి ఈ వీడియో వల్ల ఆ వ్యాపారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో.







