Long Hair : పొడ‌వాటి జుట్టును కోరుకుంటున్నారా .. అయితే ఈ టానిక్ ను మీరు వాడాల్సిందే!

పొడవాటి జుట్టు( Long hair ) కలిగిన వారు చాలా తొందరగా అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు.ఎందుకంటే పొడవాటి జుట్టు అందాన్ని మరింత పెంచుతుంది.

 Try This Miracle Tonic For Long Hair-TeluguStop.com

అందుకే చాలా మంది మగువలు జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.రకరకాల హెయిర్ ప్యాక్ లు, మాస్కులు వేసుకుంటారు.

తరచూ హెయిర్‌ను ట్రిమ్ చేస్తూ ఉంటారు.అయితే ఎన్ని చేసినా కూడా కొంద‌రిలో జుట్టు సరిగ్గా పెరగదు.

దీంతో తీవ్ర ఆందోళనకు లోన‌వుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ హెయిర్ టానిక్ ను కనుక వాడితే కొద్ది రోజుల్లోనే లాంగ్ అండ్ హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ మిరాకిల్ టానిక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Problems, Tonic, Healthy, Latest, Long, Miracle Tonic, T

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flaxseeds ) వేసుకోవాలి.అలాగే మూడు లేదా నాలుగు రెబ్బలు కరివేపాకు, కొన్ని గులాబీ రేకులు వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

Telugu Care, Care Tips, Problems, Tonic, Healthy, Latest, Long, Miracle Tonic, T

ఇప్పుడు ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ టానిక్ ను వాడారంటే జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ఈ టానిక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.పొడవాటి జుట్టును మీ సొంతం చేస్తుంది.పైగా ఈ మిరాకిల్ టానిక్ జుట్టును సిల్కీ గా మారుస్తుంది.

తేమగా ఉంచుతుంది.హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.

మరియు జుట్టు రాలడాన్ని సైతం అరికడుతుంది.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన‌ పొడవాటి జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ టానిక్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube