ఈ మ‌సాలా దినుసులు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచుతాయి!

వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి, సువాస‌న అందించే మ‌సాలా దినుసుల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.ఒక‌టా, రెండా ఎన్నో ర‌కాల‌ మ‌సాలా దినుసులు ఉన్నాయి.

 These Spices Help To Enhance Your Beauty! Spices, Beauty, Beauty Tips, Latest Ne-TeluguStop.com

అన్నిటిలోనూ పోష‌కాల‌తో పాటు బోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ప‌లు వ్యాధుల‌ను నివారించేందుకు వీటిని ఆయుర్వేదంలోనూ ఉప‌యోగిస్తాయి.అలాగే మ‌సాలా దినుసులు అందాన్ని సైతం పెంచుతారు.

అయితే అటువంటి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ ఆకు.

హెల్త్‌కి ఇది చాలా మేలు చేస్తుంది.ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తుంది.

అలాగే ఫేస్ టోన‌ర్‌లా కూడా ప‌ని చేస్తుంది.అందుకు ఒక గ్లాస్ వాట‌ర్‌లో నాలుగైదు బిర్యానీ ఆకులు వేసి పావు గంట పాటు బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్‌ను స‌ప‌రేట్ చేసుకుని కూల్ అయిన త‌ర్వాత టోన‌ర్‌గా యూస్‌ చేయాలి.త‌ద్వారా చ‌ర్మంపై పేర‌కుపోయిన దుమ్ము, ధూళి మొత్తం పోతాయి.

చర్మ రంద్రాలు బిగుతుగా మార‌తాయి.

Telugu Bay Leaf, Tips, Cardamom, Face Pack, Face, Latest, Nutmeg, Skin Care, Ski

జాజికాయ .ముడ‌త‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని మెరిపించ‌డానికి గ్రైట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అందు కోసం ఒక బౌల్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్క‌లు కొక‌న‌ట్ ఆయిల్ వేసి బాగా క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. యాలకులు.మొటిమ‌ల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.కొన్ని యాల‌కుల‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో రోజ్ వాట‌ర్ మ‌రియు తేనె స‌మానంగా వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని రాత్రి నిద్రించే ముందు మొటిమ‌ల‌పై పూసి.ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే రెండు రోజుల్లోనే మొటిమ‌లు త‌గ్గుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube