ప్రకృతిని ఆరాధించడం మన జీవితంలో ఒక భాగం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ప్రకృతి లేకుంటే భూమి పై జీవరాశి లేదు.
అలా ప్రకృతిని భక్తితో చూడడం మనకు పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాం.అదే విధంగా హిందూ మతంలో కూడా సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు.
సూర్యారాధన చేయడానికి ఆదివారం చాలా ముఖ్యమైన రోజు.దీనీ తో పాటు భాను సప్తమి కూడా ఫిబ్రవరి 26 ఆదివారం రోజే జరుపుకుంటున్నారు.

ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే సూర్యుడు జీవితం, శక్తి, తేజము, జీవనంగా పరిగణించబడతాడు.సూర్యుడు ఈ భూగోళానికే మూల శక్తి.సూర్యుడు లేనిదే ఈ భూమిని అస్సలు ఊహించలేము.మన జీవితం కూడా సూర్యకాంతి పై ఆధారపడి ఉంటుంది.కాబట్టి సూర్యుడు లేకుండా అసలు ఈ భూమి మీద జీవరాశి లేదు.
మన పూర్వీకులు సూర్యుడు మనకు చూపిన జీవితం, మార్గం కోసం కృతజ్ఞతలు చెప్పడానికి ఒక రోజును నిర్ణయించారు అదే భాను సప్తమి.భాను రథసప్తమి రోజు మగ పిల్లలు ఉన్నా తల్లిదండ్రులు ఉదయం లేచి తూర్పు వైపున సూర్యుడికి నీళ్లు వదులుతూ ఓ నమో సూర్య నారాయణాయ నమహ చదవాలని పండితులు చెబుతున్నారు.
భాను సప్తమి సూర్యారాధనకు ఎంతో ప్రముఖమైన రోజు.ఈ రోజున సూర్యోదయ సమయంలో అర్ఘ్యం సమర్పించాలి.

సూర్యుడిని పూజించడం వల్ల జాతకంలో కుజుడు ఉన్న అశుభ ప్రభావం తగ్గుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఫాల్గుణ మాసం భాను సప్తమి తిది ప్రారంభం అయ్యే సమయం ఫిబ్రవరి 26 2023 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు, ఫాల్గుణ మాసం సప్తమి తిధి ఫిబ్రవరి 27 2023 12 గంటల 53 నిమిషములకు ముగుస్తుంది.ఇంద్రయోగం ఫిబ్రవరి 25 సాయంత్రం ఐదు గంటల 18 నిమిషముల నుంచి 26వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 27 నిమిషములకు ముగిస్తుంది.త్రి పుష్కర యోగం ఫిబ్రవరి 26 2023 6.39 నిమిషముల నుంచి ఫిబ్రవరి 27 2023 మధ్యాహ్నం 12.59 నిమిషములకు ముగుస్తుంది.