హిందూమత విశ్వాసాల ప్రకారం బుధవారం( wednesday ) విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది.అయితే బుధవారం రోజున చాలామంది విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు.
బుధవారం మాత్రమే కాకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు మొదలుపెట్టిన మొదటి పూజా గణపతినే పూజిస్తూ ఉంటారు.గణపతికి పూజ చేసిన తర్వాతే ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతుంటారు.
అలాగే బుధవారం రోజున గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయని, ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుందని అంటారు.ఇక తలపెట్టే పనుల్లో కూడా విజయం సాధిస్తామని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

అయితే అదేవిధంగా బుధవారం రోజున కొన్ని రకాల పనులు చేయడం వలన మనం కెరీర్లో ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అయితే దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు మీ కెరీర్ లో విజయం సాధించాలనుకుంటే బుధవారం కొన్ని వస్తువులను దానం చేయడం మంచిదని దీనికోసం బుధవారం నాడు అవసరమైన వారికి పచ్చని వస్తువులను ధరించాలి.అంతేకాకుండా పచ్చని వస్త్రాలను( Green clothes ) కూడా దానం చేయాలి.
ఇక ఆ రోజున వివాహిత స్త్రీకి పచ్చని గాజులు( Green bangles ) దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.దీంతో సమస్యలు, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి.

ఇక శాస్త్రం ప్రకారం గణేషుడి అనుగ్రహం పొందాలనుకుంటే బుధవారం నాడు నియమనీష్టలతో వినాయకుడిని పూజించాలి.ఇక పూజ సమయంలో ఓం, గం, గణపతాయే నమః అనే మంత్రాన్ని జపించాలి.ఇలా చేయడం వలన గణేశుడు అనుగ్రహం తప్పక లభిస్తుంది.కొన్నిసార్లు బుధ దోషం కారణంగా కూడా ఒక వ్యక్తి తన కెరీర్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాడు.
కాబట్టి బుధ దోషం ఉందని కచ్చితంగా తెలిస్తే బుధవారం నాడు బంగారు ఆభరణాలు ధరించడం మంచిది.బుధవారం నాడు బంగారు ఆభరణాలు ధరించడం వలన శుభప్రదంగా భావిస్తారు.
DEVOTIONAL