హనుమాన్ జయంతి రోజున ఇలా పూజ చేయడం వల్ల.. కష్టాలు దూరమవడంతో పాటు కోరిన కోరికలన్నీ..

రామ నామ స్మరణతోనే అంతులేని బలాన్ని పొందే ధీరుడు హనుమంతుడు ( Hanuman ) అని దాదాపు ప్రజలందరికీ తెలుసు.ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ 2023 గురువారం హనుమాన్ జయంతి( Hanuman Jayanthi ) జరుపుకుంటారు.

 Worshipping Anjaneya Swamy On Hanuman Jayanthi Fulfill Your Wishes Details,worsh-TeluguStop.com

ఈ రోజునా వాయు పుత్రుడు హనుమంతుడుని పూజించడం వలన భక్తుల కష్టాలు తీరిపోవడమే కాకుండా ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి( Anjaneya swamy ) పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలన్నీ దూరమై, సుఖ సంతోషాలు కలుగుతాయి.

హనుమాన్ జయంతి రోజున పూజ చేయడమే కాకుండా కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడని ప్రజలను నమ్ముతారు.అంతే కాకుండా ఏమైనా కోరికలు ఉంటే పూర్తి నియమాలతో హనుమంతుని పూజించాలి.

ఇలా చేయడం వల్ల చేపట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయని ప్రజలు నమ్ముతారు.హనుమంతుడిని పూజించడానికి ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సనాతన ధర్మం ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పటించడం శుభమని ప్రజలు భావిస్తారు.అంతేకాకుండా సుందరకాండ, హనుమాన్ అష్టకం, హనుమాన్ చాలీసా ను పాటించడం శుభప్రదమైన ఫలితాలను పొందుతారు.దీని వల్ల ఇంట్లో ఆనందం, శాంతి కూడా నెలకొంటుంది.హనుమంతునికి సింధూరం చాలా ఇష్టమని నమ్ముతారు.హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగు దుస్తులను హనుమంతుడికి సమర్పించాలి.

ఈ విధంగా చేస్తే హనుమంతుడు ప్రసన్నమవుతాడని భక్తులకు విశేషమైన అనుగ్రహాలను ప్రసాదిస్తాడని నమ్ముతారు.హనుమంతుని దేవాలయానికి వెళ్ళి ఆయనను దర్శించుకుని, అక్కడ నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి.అంతే కాకుండా హనుమాన్ చాలీసా 13 లేదా 22 సార్లు పాటించాలి.

హనుమంతుడి జయంతి రోజున దేవాలయానికి వెళ్లి మీ కుడి చేతి బొటన వేలితో సింధూరం తీసుకొని సీతాదేవి పాదాల వద్ద రాయాలి.ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఇంకా చెప్పాలంటే చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనులు త్వరగా నెరవేరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube