పెరిగిన ఇంధన ధరలు వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ఓ గ్రామానికి చెందిన ప్రజలను అదృష్టం వరించింది.అవును.
గ్రామ పరిసరాల్లో డీజిల్‌తో కూడిన ఓ గుంత ఏర్పడటంతో ఆ గుంత దగ్గరకు జనం తండోపతండాలుగా తరలివెళ్తున్నారు.ఫ్రీగా లీటర్ల కొద్దీ డీజిల్‌ను తోడుకుంటున్నారు.
ఖాళీ వాటర్ బాటిళ్లు, పెద్ద టిన్ లలో ఆ డీసెల్ ని నింపుకొని వెళ్తున్నారు.కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు.ఆ గ్రామ ప్రజలపై అసూయ పడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో ఉన్న గీడం అనే గ్రామ ప్రజలు.గుంతలోంచి లీటర్ల కొద్దీ డీజిల్ రావడం చూసి ఫ్రీగా తోడేసుకుంటున్నారు.అయితే ఆ గుంటలోకి డీజిల్ ఎలా వచ్చి పడిందనేగా మీ అనుమానం.అక్కడికే వస్తున్నా.
రాయ్‌పూర్ నుంచి బచేలీ వెళ్తున్న ఓ డీజిల్ ట్యాంకర్.అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న బైకర్‌ను ట్రక్కు డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేసాడు.
దాంతో ఆ డీసెల్ ట్యాంకర్ బోల్తా పడింది.దీంతో భారీ మొత్తంలో డీజిల్.
నేలపాలైంది.అదికాస్తా దగ్గర్లోని నీటి గుంతలోకి చేరడంతో.
అక్కడ డీజిల్‌తో కూడిన గుంత ఏర్పడింది.
ఈ వార్త వారినోటా వీరినోటా విన్న ఆ గ్రామస్థులు ఆ గుంత దగ్గరకు చేరుకొని ఫ్రీగా లీటర్ల కొద్దీ డీజిల్‌ను తోడేసుకున్నారు.
ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది.ఇదిలా ఉంటే.డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పిన ఘటనలో ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌తో బైకర్ కూడా స్పల్పంగా గాయపడ్డారు.స్థానిక పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.
అంతేకాకుండా క్రేన్ సహాయంతో దాదాపు 3 గంటలు కష్టపడి డీజిల్ ట్యాంకర్‌ను పైకి లేపారు.







