మనలో కొందరికి హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.కానీ హెయిర్ గ్రోత్ మాత్రం సరిగ్గా ఉండదు.
దీని కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటుంది.అయితే అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.
మరి ఆ సీరం ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె,( Coconut Oil ) వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ( Dry Rosemary ) వేసి చిన్న మంటపై ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం వేసి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.అనంతరం రైస్ వాటర్ ను( Rice Water ) స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకొని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ వాటర్ లో రోజ్ మేరీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.హెయిర్ గ్రోత్ ను( Hair Growth ) ప్రోత్సహించడంలో ఈ సీరం ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి సీరం ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.రెండు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ సీరంను కనుక ఉపయోగిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా కొన్ని నెలల్లోనే దట్టంగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.అలాగే ఈ న్యాచురల్ సీరం ను వాడటం వల్ల హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది.శిరోజాలు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.కాబట్టి దట్టమైన జుట్టు కోసం ఆరాటపడేవారు, జుట్టు రాలడాన్ని ఆడ్డుకోవాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సీరం ను వాడటం అలవాటు చేసుకోండి.