నెల్లూరు జిల్లా ఆదిత్యనగర్ లో కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఏడాదిన్నర చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.
రాత్రి సమయంలో చిన్నారి నిద్రపోతుండగా దుండగులు ఎత్తుకెళ్లారని తల్లి చెబుతున్నారు.దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.