టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా జనవరి 7న పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా కేరళలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.
ఈవెంట్ లో ఎన్టీఆర్, చెర్రీల స్పీచ్ లు అదిరిపోయాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పాడో.
అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ గురించి అంతే గొప్పగా చెప్పాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నాలో సగ భాగం నా సెకండ్ హాఫ్ నా బ్రదర్ లేకపోతే ఈ సినిమా ఇంత వరకు వచ్చేది కాదు అంటూ ఎన్టీఆర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు చెర్రీ.
అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.నాలో సగం.నా బ్రదర్.నా సగభాగం అందులో నా ఎడమ భాగం.
ఎందుకంటే గుండె అటువైపే ఉంటుంది.మా స్నేహం ఆర్ఆర్ఆర్ సినిమాతో మొదలైంది కాదు.
మా బంధం ఎప్పటినుంచో ఉంది.అదేవిధంగా ఎప్పటికీ ఇలానే ఉంటుంది.ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.ఇక నా బ్రదర్ తో 200 రోజులు గడిపే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటూ రామ్ చరణ్ గురించి చెబుతూ ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు.
ఆ సమయంలో రామ్ చరణ్ వచ్చి ఎన్టీఆర్ ను హత్తుకోవడం తో అభిమానులు ఒక్కసారిగా అరుపులతో సందడి సందడి చేశారు.ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను వెండితెరపై చూడటానికి ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.