బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ), ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా కాలంగా రాజకీయంగా సైలెంట్ గానే ఉంటున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో కవిత అరెస్ట్ అయ్యి, బెయిల్ పై విడుదలైన దగ్గర నుంచి ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
కేసీఆర్ సైతం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.దీంతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మరో సీనియర్ నేత కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావులే( Harish Rao ) పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో కెసిఆర్ , కవిత సైతం సైలెంట్ గానే ఉండడంతో, అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుదనే చర్చ.

తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.ఇప్పటికే పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోగా, దాదాపు పది మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs ) , మాజీ ఎమ్మెల్యేలు , ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి కొంతమంది టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
అయినా కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి గా బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ కవిత సైతం ఇంకా యాక్టివ్ కాలేదు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ మొదలై చాలా రోజులు అవుతున్నా, కవిత హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కేసీఆర్ చాలా సైలెంట్ అయిపోయారు.

దీనికి తగ్గట్టుగానే ఆయన కాలి ఎముక విరగడంతో చాలా రోజులు విశ్రాంతిలోనే గడిపారు .ఆ గాయం నుంచి కోరుకున్న తరువాత కూడా ఆయన పార్టీ పై ఫోకస్ పెట్టకపోవడంతో , ప్రస్తుతం బీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది.ఆరు నెలలు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఒక్కరోజు సభకు కేసిఆర్ కి వచ్చారు .ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన యాగం నిర్వహించడంతో కెసిఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారు అని అంతా అనుకున్నారు.కానీ అది జరగలేదు.దసరా పండుగను పురస్కరించుకుని కేసీఆర్ యక్టీవ్తా అవుతారు అనే ప్రచారం జరిగినా ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు.దీంతో కేసీఆర్ వ్యవహార శైలి పై బీఆర్ఎస్ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది.ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో కెసిఆర్ ఇలా సైలెంట్ కావడం బీఆర్ఎస్ కు ముప్పు తెస్తుంది అనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది.