1.కర్ణాటకలో కాంగ్రెస్ విజయం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం( Congress party ) సాధించడంతో ఏపీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆనందం వ్యక్తం అయింది .భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.
2.పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు కామెంట్స్
బిజెపితోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )అన్నారని , అయినా ఎవరి చర్చలు వారు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
3.కర్ణాటక ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి కామెంట్స్
కర్ణాటకలో బిజెపిని ఓడించి మోది, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను కర్ణాటక ప్రజలు తిరస్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
4.బండ్ల గణేష్ కామెంట్స్
నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని, నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.
5.రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.2024 లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య వ్యాఖ్యానించారు.
6.కేఏ పాల్ కామెంట్స్
కర్ణాటకలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( K.A.Paul )అన్నారు
7.ప్యాకేజీ కోసమే పొత్తులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు.పవన్ స్పెషల్ ప్యాకేజీ కోసం పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరి ఎజెండాలను పవన్ అమలు పరచాలనుకుంటున్నాడు అని మంత్రి విమర్శించారు.
8.కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
9.జర్నలిస్ట్ హెల్త్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి
జర్నలిస్టులకు హెల్త్ క్యాంప్ ను మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విడుదల రజిని ప్రారంభించారు .విజయవాడ లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో జర్నలిస్టులకు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జర్నలిస్టులు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
10.ఇంటర్ అడ్మిషన్లు
తెలంగాణలో మే 15 నుంచి ఇంటర్ అడ్మిషన్లు( TS Inter Admissions ) ప్రారంభం కానున్నాయి.జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
11.జగిత్యాల బందుకు విశ్వహిందూ పరిషత్ పిలుపు
జగిత్యాల పట్టణ బంద్ కు విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది.జగిత్యాల బస్ డిపో ముందు విశ్వహిందూ పరిషత్ ఆందోళన చేపట్టింది.
12.కర్నూలులో జాతీయ లోక్ అదాలత్
నేడు కర్నూలులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది.జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోదగ్గ కేసుల కోసం 23 బెంచ్ లు ఏర్పాటు చేశారు.
13.చంద్రబాబు పర్యటన
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.
14.స్వచ్ఛ తిరుమల శుద్ధ తిరుమల కార్యక్రమం ప్రారంభం
స్వచ్ఛ తిరుమల, శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు.
15.రాజమండ్రిలో ఉమెన్స్ కమిషనర్ పర్యటన
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ 35 సంవత్సరాల ప్రజాప్రస్థానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
16.సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు
లేపాక్షిలో నేటి నుంచి 15వ తేదీ వరకు శ్రీ సత్యసాయి జిల్లాస్థాయి సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు జరగనున్నాయి.
17.వైసీపీ ప్రజా ప్రతినిధుల అక్రమాలపై అభియోగాలపై స్వీకరణ
నేడు గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలపై అభియోగాల స్వీకరణ చేపట్టారు.ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం అంటూ చార్జిషీట్ దాఖలు చేయనున్న బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
18.ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు
నేటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు జూన్ 12 వరకు సెలవులు కొనసాగనున్నాయి.
19.రాజకీయ లబ్ధి కోసమే జగిత్యాల బంద్
జగిత్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు జరిగిన సంఘటనపై రూరల్ ఎస్ఐ అనిల్ తాజాగా వీడియోలు విడుదల చేశారు.జగిత్యాల పట్టణ బంద్ కు నాకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ నాయకులు, కొన్ని వర్గాల వారి స్వలాభం కోసమే బంద్ చేస్తున్నాయని అన్నారు.