Deepam In Pooja Room: మన ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఈ పొరపాటులను అస్సలు చేయకండి..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ ఇంట్లో ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు.పూజ చేసేటప్పుడు దీపాలు వెలిగించడం అన్నది ఎంతో పవిత్రమైన పని.

 Do Not Make These Mistakes While Lighting The Lamp In The Pooja Room Details, De-TeluguStop.com

దీపాలు వెలిగించడం దాదాపు అన్ని మతపరమైన ఆచారాలలో, కర్మలలో శుభంగా భావిస్తారు.అందువల్ల దీపం వెలిగించకుండా పూజ పూర్తి కాదు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు.

ముఖ్యంగా ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.మన ఇంట్లో దీపం వెలిగిస్తే సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అలాగే ప్రతికూల శక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది.

జ్యోతిష్య శాస్త్రంలో దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి.

లేదంటే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.అలా రాకూడదంటే దీపాలు వెలిగించేటప్పుడు చేయవలసిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపం వెలిగించే ముందు దాన్ని దిశను తప్పకుండా తెలుసుకోవాలి.పూజా సమయంలో దీపాన్ని తప్పుడు దిక్కులో వెలిగించకూడదు.

దీపం తప్పుగా పెట్టడం వల్ల ఆ ఇంట్లో ధన నష్టం తో పాటు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడూ పడమర దిశనే ఎంచుకోవడం మంచిది.

Telugu Bakti, Deepam, Deepam Pooja, Devotional, Oil Lamp, Pooja, Pooja Deepam, W

ఆ దిశలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ఇంట్లో పూజ గదిలో దేవుడి ముందు రెండు రకాల దీపాలు వెలిగించాలి.దేవుడి కుడివైపు ఉంటే నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం.దేవుడికి ఎడమవైపు దీపం వెలిగించాలంటే నూనె దీపం వెలిగించడం మంచిది.ఇంకా చెప్పాలంటే దీపం వెలిగించేటప్పుడు అసలు ఈ తప్పులను చేయకూడదు.అవేమిటంటే విరిగిన దీపాన్ని ఉపయోగించడం ఇంట్లో అంత మంచిది కాదు.

దీని వల్ల ఆ ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube