మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు శుభానికి గుర్తుగా స్వస్తిక్ గుర్తును వేయటం మనం చూస్తుంటాము.స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల ఆ కార్యక్రమం ఎటువంటి ఆటంకములు లేకుండా శుభంగా పూర్తవుతుందని పండితులు చెబుతుంటారు.
విఘ్నహర్త అయిన గణపతికి స్వస్తిక్ ప్రతీక కాబట్టి,ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ కార్యం ఆటంకం లేకుండా ఈ గుర్తును వేస్తారు.అదేవిధంగా స్వస్తిక్ గుర్తును పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో చిన్నపిల్లల తలపై వేస్తారు.
ఈ విధంగా వేయడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
స్వస్తిక్ గుర్తు సూర్యభగవానుని గతిని సూచిస్తుంది అంటారు కనుక పూర్వకాలంలో సూర్య పూజలకు ఈ స్వస్తిక్ గుర్తు చిహ్నంగా ఉండేది.
అదేవిధంగా దీపావళి వంటి పండుగ సమయాలలో కొత్తగా వ్యాపారం ప్రారంభించే వర్తకులు ఖాతా పుస్తకాలలో స్వస్తిక్ గుర్తును గీస్తారు.అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలలో వివాహసమయంలో వధూవరులకు నుదుటిపై స్వస్తిక్ గుర్తు ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల వారి దాంపత్య జీవితం బాగుంటుందని భావిస్తారు.

పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో చిన్నారుల తలపై స్వస్తిక్ గుర్తును వేస్తారు.శిశువు పుట్టిన సంవత్సర కాలం లోపు శిశువుకు ఈ వెంట్రుకలు కత్తిరించడం జరుగుతుంది.ఈ విధంగా పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత గుండెకు చల్లదనం ఉండటంకోసం గంధం తైలం పూస్తారు.ఆ తరువాత శిశువు తండ్రి శిశువు తల పై స్వస్తిక్ గుర్తును గీస్తాడు.
ఈ విధంగా స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల భగవంతుడు తలచినదే శిశువు కూడా తలచును గాక అనే అర్థాన్ని సూచిస్తుంది.కనుక వెంట్రుకలు తీసే సమయంలో చిన్న పిల్లలు భగవంతునితో సమానంగా భావించి వారి తలపై ఈ చిహ్నాన్ని వేస్తారు.
ఆ తరువాత శిశువు కుటుంబ సభ్యులందరూ శిశువును ఆశీర్వదిస్తారు.