వాలి, సుగ్రీవులు వృక్ష వ్రజస్సు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన వానర సంతానం.ఒక సారి వృక్ష వ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు.
ఆ తటాకంకి ఉన్న శాప ప్రభావం వల్ల వృక్ష వ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు.అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్ష వ్రజస్సును చూసి మోహితుడై వాల భాగంలోను, కంఠ భాగంలోను వీర్యాన్ని విడిచి పెడతారు.
దానికి వృక్ష వ్రజస్సు కంగారు పడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు.వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.
అయితే వాలికి నేరుగా తనను ఎదురించిన శత్రువు యొక్క బలం సగం క్షీణిస్తుందని బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్లు పురాణాల్లో వివరించబడంది.అందువల్లే శ్రీ రామ చంద్రుడు వాలిని ఎదురుగా వచ్చి వధింపక చాటు నుండి చంపినట్లు చెబుతారు.కానీ ఈ విషయం వాల్మీకి రామాయణంలో లేదు.‘ఉమాసంహిత’ అనే గ్రంధంలో ఉన్నది.వాలిని రాముడు అభి ముఖంగా వచ్చి వధించక పోవడానికి కారణం, వాలి మెడలో ధరించిన ‘కాంచన మాల’ అని కూడా చెప్పడం కద్దు.ఇంద్రుడు తన కుమారుడైన వాలికి ఇచ్చిన మాల ఇది.
అక్షయమై, గుణ సంభరితమైన కాంచన మాలను వాలికి ఇచ్చి ఇంద్రుడు స్వర్గానికి వెళ్లాడని కూడా పురాణాల్లో ఉంది.కాండలో ఇంద్రుడు ఇచ్చిన వజ్ర భూషితమైన మాల వాలి ప్రాణాలను, తేజమును, శోభను ధరించిందని చెప్పడమైనది.
అయితే చివరి దశలో వాలి ఈ మాలను సుగ్రీవునికి ఇచ్చాడు.వాలి ప్రాణాలను గూడా మాల ధరించిందని చెప్పడం వల్ల వాలికి ఇంద్రుడు ఇచ్చిన ప్రాణ రక్షకమైన వరంగా దాన్ని భావిస్తారు.
ఇలాంటి విషయాలలో వాల్మీకి రామాయ ణాన్నే ప్రమాణంగా తీసుకోవాలి.మిగిలిన వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చాలా మంది పెద్దలు చెబుతుంటారు.