ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.18
సూర్యాస్తమయం: సాయంత్రం.5.41
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11
మేషం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
వృషభం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి.
కర్కాటకం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.
కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
పిల్లల చదువుల పట్ల కాస్త ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తుల:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.
వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ధనుస్సు:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.
ఆరోగ్యం కూడా సహకరించదు.మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.
మకరం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది.
మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మీనం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల ఈరోజు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.








