ముఖ్యంగా చెప్పాలంటే జాతకంలో గ్రహాల స్థానం వ్యక్తి జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు,( Shukra ) సంపద, ఐశ్వర్యం, శరీరక సుఖాలకు కారకంగా ప్రజలు పరిగణిస్తారు.
తులా రాశి, వృషభ రాశులకు అధిపతి శుక్రుడు.ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే అటువంటి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఉంటాడని భౌతిక సౌకర్యాలను పొందుతాడని చెబుతున్నారు.
శుక్రుడు బలహీన స్థితిలో ఉంటే వ్యక్తి శరీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.శుక్ర గ్రహాన్ని బలపేతం చేయడానికి కొన్ని చర్యలు ఉన్నాయి.
ఈ చర్యలు పద్ధతిగా చేస్తే జీవితంలో సమస్యలను దూరం చేసుకోవచ్చు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటాడో అతనికి డబ్బుకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
సాధారణ సౌకర్యాలు కూడా ఉండవు.అంతేకాకుండా ఏ పని చేయడానికి అయినా భయపడుతూ ఉంటాడు.ఆ వ్యక్తిలో విశ్వాసం( Confidence ) ఉండదు.బలహీనంగా ఉంటాడు.జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి ప్రేమలో మోసపోవచ్చు.ఒక వేళ వివాహం( Marriage ) జరిగి ఉంటే అతనికి దాంపత్య సుఖం కూడా ఉండదు.
అలాగే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే చర్మ, పాదాల, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.ఎవరి జాతకంలో శుక్ర గ్రహణం బలహీనంగా ఉంటే శుక్రుడు బలపడడానికి శుక్రవారం రోజు ఉపవాసం పాటించాలి.11 లేదా 21 శుక్ర వారాల వరకు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
అంతేకాకుండా ఆర్థిక సమస్యలు( Financial Problems ) కూడా దూరం అవుతాయి.ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే పూజ సమయంలో కనీసం 108 సార్లు శుక్ర మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఐశ్వర్యం, శరీరక సుఖాలను పొందుతాడు.
ఇంకా చెప్పాలంటే జాతకంలో శుక్ర గ్రహం బలపడాలంటే శుక్రవారం రోజు పాలు, పెరుగు, అన్నం, పంచదార మొదలైన తెల్లటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.దీనితో పాటు శుక్రవారం తెల్లటి వస్తువులను దానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU