Worship to God offering : భగవంతుడు నైవేద్యం తినడు కదా.. మరి నైవేద్యం ఎందుకో తెలుసా..

మన దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలలో చాలామంది ప్రజలు ప్రతిరోజు భగవంతునికి పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా మరి కొంతమంది ప్రజలు ఇంట్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు.

 God Doesn't Eat Offering  Do You Know Why Offering , Worship To God ,  Offering-TeluguStop.com

ఏ పూజ చేసినా సరే వారు ఆరాధించే భగవంతునికి పూజ అయిపోయిన తర్వాత కచ్చితంగా నైవేద్యం మాత్రం అందరూ సమర్పించాల్సిందే.ఎన్ని రకాల పూజలు చేసినా ఏ పూజలో అయినా సరే ఇలా చివరికి నైవేద్యం సమర్పించాల్సిందే.

దేవతలు మారుతూ ఉంటే నైవేద్యం కూడా మారుతూ ఉంటుంది.అసలు దేవుడు అనేవాడు తింటాడ లేకపోతే తినడా? నైవేద్యం ఎందుకు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Items, Bakti, Devotional, Naivedyam, Nature, Worship God-Telugu Bhakthi

నైవేద్యం భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు తినడు కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతా భావాన్ని నైవేద్యం సూచిస్తుంది.ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి తినే ఆహార పదార్థాలన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే ప్రకృతిని సృష్టించి జాగ్రత్తగా కాపాడుతున్న ఆ భగవంతునికి ఈ మనిషి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదే నైవేద్యం.ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పూట గడవని నిరుపేద నుంచి కోట్ల రూపాయలు సంపాదించిన వారి వరకు ఎవరి హోదాకు తగ్గ నైవేద్యం వారు భగవంతునికి సమర్పిస్తూనే ఉంటారు.

భగవంతుడు భక్తితో ఏమిచ్చినా తీసుకునేందుకు భక్త శబరి, భక్తకన్నప్పలే నిదర్శనం.అందుకే భగవంతునికి సమర్పించిన నైవేద్యం ఎంతో రుచిగా ఉంటుంది.ఇంట్లో గమనిస్తే ఎంత శ్రద్ధగా చేసిన ఆ రుచి రాదు.కానీ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు సమర్పించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది.

మనిషి అనే వాడు అన్నం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం ఉంటుంది.కానీ భగవంతుడికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం తగ్గి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఆహారాన్ని వృధా చేయకూడదని దీనిలో అర్థం ఉంది ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆకలితో చనిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube