Kodali Nani Apollo Hospital : అపోలో ఆసుపత్రిలో మాజీమంత్రి కొడాలి నాని..!!

గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అపోలో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది.కిడ్నీలో రాళ్లు ఉండటంతో సర్జరీ చేయించుకున్నారు.

 Former Minister Kodali Nani In Apollo Hospital Kodali Nani, Ysrcp, Appolo Hospit-TeluguStop.com

ప్రస్తుతం అపోలో హాస్పిటల్ ఐసీయూలో ఉన్న ఆయన  రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు.ఆ తర్వాత రెండు వారాలు పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

15 రోజులు విశ్రాంతి తర్వాత లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడానికి కొడాలి నాని రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

రాజకీయ నేతగా కొడాలి నానికి గుడివాడలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

 వైసీపీ పార్టీలో ఉన్న అందరి నాయకులలో కొడాలి నాని.సీఎం జగన్ కి నమ్మినబంటు.

ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చాలా సందర్భాలలో తెలిపారు.ఇక వైసీపీ తరుపున టీడీపీ కీలక నాయకులకు కౌంటర్ లు ఇవ్వడంలో నాని ఎప్పుడూ కూడా ముందుంటారు.

ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ కి తనదైన పంచ్ డైలాగులతో కౌంటర్ లు వేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఆయన హాస్పిటల్ లో  జాయిన్ అయినట్లు వార్తలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube